“అన్నమయ్య”, “రామదాసు” లాగే “ఓం నమో వెంకటేశాయ” కూడా హిట్ అయ్యిందా?.. రివ్యూ (తెలుగులో) మీరే చూడండి!

Movie Title: ఓం నమో వెంకటేశాయ! (Om namo venkateshaya)

Cast & Crew:

 • నటీనటులు: నాగార్జున, అనుష్క శెట్టి, ప్రజ్ఞ జైస్వాల్, జగపతి బాబు, సౌరభ్ జైన్
 • దర్శకుడు: కె. రాఘవేందర్ రావు
 • సంగీతం: ఎం. ఎం. కీరవాణి
 • నిర్మాత: మహేష్ రెడ్డి (సాయి కృప ఎంటర్టైన్మెంట్ బ్యానర్)

Story:

15 వ శతాద్భములో “వేంకటేశ్వరుని” భక్తుడు అయిన “హాథిరామ్ బావాజీ” కథ ఆధారంగా తీసుకున్నదే “ఓం నమో వెంకటేశాయ” సినిమా…రామా (హాథిరామ్ భావజా – నాగార్జున) రాముని భక్తుడు…దేవుడిని చూడాలి అన్న కోరికతో పరితపిస్తుంటాడు…కానీ ఈ సమయంలో రామాకి అతని మరదలు(ప్రజ్ఞ జైస్వాల్) తో పెళ్లి నిశ్చయిస్తారు రామా తల్లి తండ్రులు…పెళ్లిని నిరాకరించి వెంకటేశ్వరా స్వామిని దర్శించడానికి “తిరుమల” కి వెళతాడు రామా…తిరుమలలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరిస్తున్న “కృష్ణమ్మ (అనుష్క)” ని కలుస్తాడు “రామా”…”కృష్ణమ్మ” సహాయంతో ఎక్కువ మంది భక్తులను తిరుమలకు వచ్చేలా చేస్తాడు “రామా”…ఇది నచ్చని అక్కడి గుడి పెద్దలు..రామా ని రాజు దగ్గరికి తీసుకెళ్తారు…రామాకి పెద్ద శిక్ష విధిస్తారు అక్కడి రాజు..ఈ చావు పరీక్ష నుండి రామా ఎలా భయటపడాడ్డు? శ్రీనివాసుడు ఎలా ఆదుకున్నాడు? అనేది తెలియాలి అంటే “ఓం నమో వెంకటేశాయ” సినిమా చూడాల్సిందే!

Review:

హాథిరామ్ బాబా, వేంకటేశుని భక్తుడు ఎలా అయ్యాడో, అతను శ్రీనివాసుడిని ఎలా కలిశాడో కళ్ళకు కట్టినట్టు చూపించారు దర్శకేంద్రుడు…నాగార్జున, అనుష్క సంప్రదాయ వస్త్రాలలో అందరిని ఆకట్టుకున్నారు…ప్రేక్షకులని భక్తి పరవశంలోకి తీసుకెళ్లగలిగింది “కీరవాణి” గారు అందించిన “సంగీతం” అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అనే చెప్పొచ్చు!.. “హాథిరామ్ బాబా” కథ తెలుసుకోవాలనుకునే వారు తప్పక ఈ సినిమా చూడాలి…”అన్నమయ్య, రామదాసు” సినిమాలు ఎలాంటి భావాలు తెచ్చాయో ఈ సినిమా కూడా అదే భక్తి లోకం లోకి తీసుకెళ్లడంలో విజయవంతం అయ్యింది!

Plus Points:

 • నాగార్జున భక్తి రస నటన
 • వేంకటేశునిగా “సౌరభ్ జైన్” నటన
 • ప్రత్యేక పాత్రలో “జగపతి బాబు”
 • భక్తురాలిగా “అనుష్క”
 • సినిమాటోగ్రఫీ
 • మరోసారి పాత సినిమాలోకం లోకి తీసుకెళ్లిన “రాఘవేందర్ రావు” దర్శకత్వం

Minus Points:

 • కొన్ని చోట్ల కెమెరాతో సరిగా చిత్రీకరించలేకపోయారు
 • స్క్రీన్ప్లే అంతగా బాగోలేదు
 • సాగతీసే సినిమా లెంత్
 • పాటలు బాగున్నప్పటికీ..బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేక పోయింది
 • పెద్ద ఆర్టిస్ట్స్ మినహా…మిగిలినవారు నటన అంత ఆకట్టుకోలేకపోయింది
 • “ప్రజ్ఞ జైస్వాల్” పాత్ర కొద్దిసేపు మాత్రమే ఉంది

Final Verdict:

వేంకటేశుని భక్తులందరూ తప్పక్క చూడాల్సిన సినిమా “ఓం నమో వెంకటేశాయ”..నాగార్జున, రాఘవేందర్ రావు, కీరవాణి ల కాంబినేషన్ మరోసారి హిట్ కొట్టేసింది..”అనుష్క” కెరీర్ లో కూడా మంచి గుర్తింపు ఇచ్చే సినిమా ఇది!

AP2TG Rating: 3.5/5

Trailer:

Comments

comments

Share this post

scroll to top