ఓం మంత్రాన్ని ప‌ఠించ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

హిందువులు చ‌దివే మంత్రాల్లో ఓం అనే మంత్రానికి చాలా ప్రాధాన్య‌త ఉంది. ఇది ఏకాక్ష‌ర మంత్రం. ఓం లేదా ఓమ్ అని ప‌లుకుతారు. ఈ మంత్రం త్రిమూర్తి స్వ‌రూపంగా చెప్ప‌బ‌డుతోంది. అ, ఉ, మ‌కార శ‌బ్దాల‌తో ఓం ఏర్ప‌డుతుంది. ఓంకారం శ‌బ్దాల్లో మొద‌టిది. హిందూ మ‌తానికి కేంద్ర బిందువు. దీన్ని ప‌రమాత్మ‌కు ప్ర‌తీక అని చెబుతారు. అయితే దీన్ని ప‌ల‌క‌డం వ‌ల్ల జ‌న‌నావ‌య‌వాల నుంచి త‌ల వ‌ర‌కు శ‌క్తి చేకూరుతుంది. ఓం ప‌లికే సంద‌ర్భంలో మొద‌ట శ‌క్తి జ‌న‌నావ‌య‌వాల ద‌గ్గ‌ర ఉద్భ‌విస్తుంది. అది అనంత‌రం జీర్ణాశ‌యానికి ఆపై ఛాతికి అక్క‌డి నుంచి త‌ల‌కు చేరుతుంది. దీంతో అనేక లాభాలు ఉంటాయి.

1. రోజూ ఓం అనే మంత్రాన్ని ధ్యానంలో కొన్నిసార్లు ఉచ్చ‌రించ‌డం వ‌ల్ల చాలా శ‌క్తి ఉద్భ‌విస్తుంది. ఓ ద‌శ‌లో ఆధ్యాత్మిక స్థాయి పెరిగి దైవంతో మ‌న ఆత్మ క‌నెక్ట్ అవుతుంది. దీంతో ఒంట్లో పాజిటివ్ వైబ్రేష‌న్స్ వ‌చ్చి అనారోగ్యాలు న‌య‌మ‌వుతాయి.

2. ఓం మంత్రాన్ని ఉచ్చ‌రించ‌డం వల్ల ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా, ర‌క్త స‌ర‌ఫ‌రా స‌రిగ్గా జ‌రుగుతాయి. దీంతో మెద‌డుకు కొత్త శ‌క్తి అందుతుంది. మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది. ఒత్తిడి, ఆందోళ‌న దూర‌మ‌వుతాయి.

3. డిప్రెష‌న్‌లో ఉన్న వారు నిత్యం ఓం మంత్రాన్ని చ‌దివితే ఫ‌లితం ఉంటుంది. కొత్త శ‌క్తి, ఉత్సాహం వ‌స్తాయి. చురుగ్గా మళ్లీ ఎప్ప‌టిలా ప‌నిచేసుకోగ‌లుగుతారు.

4. మెద‌డుకు శ‌క్తి ఎక్కువ‌గా అంద‌డం వ‌ల్ల జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. ఆలోచ‌నా శ‌క్తి పెరుగుతుంది. కొత్త ఆవిష్క‌ర‌ణ‌లు చేయ‌గ‌లుగుతారు. చురుగ్గా ఆలోచించ‌గ‌లుగుతారు.

5. ఏకాగ్ర‌త పెరుగుతుంది. ఏదైనా అంశంపై దృష్టి సారిస్తే ధ్యాస త‌ప్ప‌కుండా ఉంటుంది. చ‌దువుల్లో చ‌క్క‌గా రాణించ‌వ‌చ్చు. విద్యార్థుల‌కు బాగా మేలు జ‌రుగుతుంది.

6. ఓం మంత్రాన్ని రోజూ ఉచ్చ‌రించ‌డం వ‌ల్ల శ‌రీరం, మ‌న‌స్సు అన్నీ మ‌న కంట్రోల్‌లోకి వ‌స్తాయి. అన‌వ‌స‌ర‌పు ఆలోచ‌న‌లు రావు.

7. శ‌రీరంలో ఉన్న విష ప‌దార్థాలు బ‌య‌టికి వెళ్లిపోతాయి. శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్ర‌మ‌వుతుంది. చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది.

8. ఓం మంత్రాన్ని మ‌నం ॐ అక్ష‌రంతో రాస్తాం కదా. అయితే ఈ అక్ష‌రం వినాయ‌కున్ని పోలి ఉంటుంది. అక్ష‌రం పై భాగం వినాయ‌కుడి త‌ల‌ను మ‌ధ్య బాగం తొండాన్ని, కింది భాగం వినాయ‌కుడి పొట్ట‌ను సూచిస్తాయి. దీంతో ఓంను ఉచ్చ‌రించ‌డం వ‌ల్ల ఆయ‌న్ను పూజించిన‌ట్టు కూడా అవుతుంది. ఇలా చేయ‌డం వ‌ల్ల వినాయ‌కుడి అనుగ్ర‌హం కూడా ల‌భిస్తుంది.

9. స్వ‌ర పేటిక స‌మ‌స్య ఉన్న‌వారు ఓం మంత్రాన్ని ప‌ఠించాలి. ఆ స‌మ‌స్య పోతుంది. మృదువైన కంఠ స్వ‌రం వ‌స్తుంది.

10. ఇస్లాంలో ఓం ను స‌మా అని పిలుస్తారు. అక్ష‌రం కూడా హిందూ ఓంను పోలి ఉంటుంది. దాంతో కూడా పైన చెప్పిన విధంగా ఫ‌లితాలు క‌లుగుతాయి.

11. రోజూ ఉద‌యాన్నే క‌నీసం 50 సార్లు ఓం మంత్రం ప‌ఠిస్తే మంచి ఫ‌లితాలు క‌లుగుతాయి.

Comments

comments

Share this post

scroll to top