ఆ వృద్ధురాలు కూలి పని చేయగా వచ్చిన డబ్బుతో గుడిని నిర్మించింది… ఎందుకో తెలుసా..?

కష్టపడి పైసా పైసా కూడబెట్టి డబ్బులు సంపాదిస్తే ఎవరైనా ఏం చేస్తారు? మంచి ఇల్లు కొనుడమో, ఏదైనా వ్యాపారం చేసుకోవడమో, పెట్టుబడి పెట్టడమో చేస్తారు. లేదా ఇంకా వేరే ఏదైనా సొంత పని చేసుకుంటారు. కానీ ఆ వృద్ధురాలు మాత్రం అలా కాదు. తన జీవితాంతం సంపాదించిన డబ్బుతో ఏకంగా ఓ ఆలయాన్నే నిర్మించింది. ఇంతకీ ఆ వృద్ధురాలు ఎందుకు అలా చేసింది? తెలుసుకుందాం రండి.

old-woman-temple

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా సోమల మండలం చిన్న ఉప్పరపల్లికి చెందిన అంజయ్య, చిన్నక్కలు దంపతులు. వీరికి మొత్తం ముగ్గురు కుమారుడు. ఇద్దరు మృతి చెందారు. చివరి కొడుకైన కృష్ణయ్య ఉపాధి కోసం వేరే ప్రాంతానికి వెళ్లాడు. ఈ క్రమంలో అంజయ్య అనారోగ్యంతో మృతి చెందగా చిన్నక్క ఒంటరిదైంది. దీంతో ఆమె స్థానికంగా బండరాళ్లు కొట్టి జీవనం సాగిస్తుండేది. అలా ఒక రోజు ఆమె పనిలో ఉండగా ఓ గుట్టపై ఆమెకు ఆంజనేయ స్వామి విగ్రహం కనబడింది. దీంతో ఆమె ఆ విగ్రహాన్ని తనతో తెచ్చుకుని ఇంటి వద్ద ప్రతిష్టించి పూజలు చేయడం ఆరంభించింది. ఈ క్రమంలో ఆమెకు దీర్ఘకాలికంగా ఉన్న వ్యాధి ఒకటి ఇట్టే తగ్గిపోయింది. దీంతో స్వామి మహిమ తెలుసుకున్న చిన్నక్క తాను కూడబెట్టిన రూ.30వేలతో తన ఇంటి ఆవరణలోనే ఆంజనేయ స్వామికి గుడి కట్టించింది. ఈ క్రమంలోనే తనకు ఉన్న కొద్ది పాటి భూమిని కూడా ఆమె విక్రయించింది. దీంతో ఆ భూమికి రూ.3 లక్షలు వచ్చాయి. అయితే ఆ మొత్తాన్ని కూడా చిన్నక్క గుడి కోసమే కేటాయించింది. ఆలయ ఆవరణలో రామ మందిరం, అన్నదాన సత్రాలను ఏర్పాటు చేసింది. అంతేకాదు ప్రతి ఏటా హనుమాన్ జయంతి, శ్రీరామనవమి వేడుకలను నిర్వహిస్తోంది.

కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నా దేవాలయాన్ని నిర్మించిన చిన్నక్క స్పృహను ఆ గ్రామస్తులే కాదు ఆమె గురించిన విషయం తెలిసిన ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. ఏది ఏమైనా కష్టపడి సంపాదించిన సొమ్మును దాచుకోకుండా నలుగురికీ ఉపయోగపడేలా గుడి కోసం ఖర్చు పెట్టిన చిన్నక్క ఆలోచనను నిజంగా మనం అభినందించాల్సిందే!

Comments

comments

Share this post

scroll to top