ఓలా క్యాబ్ లో ఆ మ‌హిళ ప్ర‌స‌వించింది. అందుకు ఓలా సంస్థ ఆ మ‌హిళ‌కు ఏం గిఫ్ట్ ఇచ్చిందో తెలుసా..?

పురిటి నొప్పుల‌తో బాధ‌ప‌డుతూ ప్ర‌స‌వానికి సిద్ధంగా ఉన్న గ‌ర్బిణీ మ‌హిళ‌ల‌ను హాస్పిట‌ల్‌కు త‌ర‌లించాలంటే నిజంగా ఎవ‌రికైనా స‌వాలే మ‌రి. వాహ‌నంలో త‌ర‌లిస్తే ఏ డ్రైవ‌ర్ అయినా చాలా కేర్‌ఫుల్‌గా వాహ‌నం న‌డిపించాల్సి ఉంటుంది. లేదంటే గ‌ర్భిణీ మ‌హిళ‌కే కాదు, ఆమె క‌డుపులో ఉండే బిడ్డ‌కు కూడా చాలా ప్ర‌మాదం. అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోయే ఓ డ్రైవ‌ర్ మాత్రం నిజంగా ఆ గ‌ర్బిణీ మ‌హిళ‌ను చాలా కేర్‌ఫుల్‌గానే హాస్పిట‌ల్ కు తీసుకొచ్చాడు. కానీ దారిలోనే ఆమె ప్ర‌స‌వించింది. అయిన‌ప్ప‌టికీ తల్లీబిడ్డ ఇద్ద‌రినీ ఆ డ్రైవ‌ర్ చాలా క్షేమంగా హాస్పిట‌ల్‌లో దింపాడు. చివ‌ర‌కు మ‌ళ్లీ హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జి అయిన‌ప్పుడు కూడా అదే డ్రైవ‌ర్ ఆ మ‌హిళ‌ను ఇంటి వ‌ద్ద దిగ‌బెట్టాడు. అయితే డ్రైవ‌ర్ ఆ మ‌హిళ‌ను సురక్షితంగా దింప‌డంతోపాటు ఆ మ‌హిళ‌కు కారులోనే ప్ర‌స‌వం అవ‌డంతో ఆ కారు క్యాబ్ కంపెనీ ఆ మ‌హిళ‌కు ఏకంగా 5 ఏళ్ల పాటు ఉచిత రైడ్‌ల‌ను గిఫ్ట్‌గా అందించింది.

అది పూణెలోని ఓ ప్రాంతం అక్క‌డ ఉండే ఈశ్వ‌రి సింగ్ విశ్వ‌క‌ర్మ‌కు ఈ నెల 2వ తేదీన గాంధీ జ‌యంతి నాడు పురిటి నొప్పులు ప్రారంభ‌మ‌య్యాయి. దీంతో భ‌ర్త ఓలా క్యాబ్ బుక్ చేశాడు. క్యాబ్ వ‌చ్చింది. అందులో ఆమెను స్థానికంగా ఉన్న ఓ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. అయితే మార్గ మ‌ధ్య‌లో ఆమెకు నొప్పులు ఎక్కువ‌య్యాయి. అయినప్ప‌టికీ ఆ ఓలా క్యాబ్ డ్రైవ‌ర్ య‌శ్వంత్ గ‌లాండె సేఫ్‌గా కారును న‌డిపాడు. కానీ ఆ గ‌ర్భిణీ మ‌హిళ కారులోనే ప్ర‌స‌వించింది.

అయితే ఈశ్వ‌రి సింగ్‌ను, ఆమెకు పుట్టిన బిడ్డ‌ను కారు డ్రైవ‌ర్ య‌శ్వంత్ సుర‌క్షితంగా హాస్పిట‌ల్‌లో చేర్చాడు. అనంత‌రం త‌ల్లీ బిడ్డ ఇద్ద‌రూ క్షేమంగా ఉన్న‌ట్టు హాస్పిట‌ల్ వారు చెప్పారు. దీంతో డ్రైవ‌ర్ సురక్షితంగా వారిని చేర్చినందుకు గాను అత‌న్ని అంద‌రూ అభినందించారు. ఇక ఆ క్యాబ్ సంస్థ ఓలా అయితే ఈశ్వ‌రి సింగ్‌కు ఓ గిఫ్ట్ ఇచ్చింది. ఆమెకు 5 ఏళ్ల పాటు ఓలా క్యాబ్‌ల‌లో ఉచితంగా వెళ్లే స‌దుపాయం క‌ల్పించింది. పుట్టిన బిడ్డ పేరిట ఓ కూప‌న్ కోడ్‌ను ఇస్తామ‌ని, దాంతో ఈశ్వ‌రి సింగ్ 5 ఏళ్ల పాటు ఓలా క్యాబ్‌లో ఉచితంగా ప్ర‌యాణించవచ్చ‌ని ఓలా సంస్థ తెలిపింది. ఏది ఏమైనా ఆ తల్లీ బిడ్డ‌ను క్షేమంగా హాస్పిట‌ల్‌కు చేర్చినందుకు ఆ డ్రైవ‌ర్‌కు నిజంగా అభినంద‌న‌లు తెల‌పాల్సిందే.

Comments

comments

Share this post

scroll to top