“ఒక్కడు” సినిమాలో “మహేష్ బాబు” కి చెల్లిగా నటించిన అమ్మాయి గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందో చూడండి.!

నిహారికా గుర్తుందా.. ఏ నిహారికా మన జబర్దస్త్ నాగబాబు కూతురు..ఢీ ప్రొగ్రామ్ యాంకరేనే ఎందుకు గుర్తు లేదూ భేషూగ్గా గుర్తుంది..ఆ మధ్య ఒక మనసు సినిమా చేసింది కదా ..అందులో భలే చేసింది కదా..ఆవకాయ ముద్దపప్పు వెబ్ సిరిస్ లో కూడా సూపర్ చేసింది..మెగా ఫ్యామిలి ప్రిన్సెస్ కదా ఎందుకు గుర్తుండదూ..అబ్బా ఆపండి..నిహారికా అంటే తనొక్కతేనా..నేను చెప్పే నిహారికా తను కాదు..అయినా మీకు అలా చెప్తే గుర్తు రాదు..ఆశ గుర్తుందా..ఒక్కడు సినిమాలో అజయ్ చెల్లెలు ఆశ..హా గుర్తుంది.అల్లరిపిల్ల..అన్ననే ఏడిపించేస్తుంటుంది..హా ఆ అమ్మాయే…

మహేశ్ బాబు ,గుణశేఖర్ కాంబినేషన్లో వచ్చిన ఒక్కడు సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్..భూమిక అందం అప్పటి కుర్రకారుకి కళల్లో వచ్చి ఉక్కిరిబెక్కిరి చేసింది.ఈ సినిమా కోసం ఛార్మినార్ ని సెట్ వేసారు తెలుసా..ఎందుకంటే ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయని ఛార్మినార్ పైకి ఎవర్నీ ఎక్కినవ్వకపోవడంతో షూటింగ్ అక్కడ జరపడానకి అవ్వకపోవడంతో..హైదరాబాద్ సిటీ అవుట్ స్కట్స్ లో ఛార్మినార్,ఓల్డ్ సిటి సెట్ వేసి షూట్ చేసారు.ఈ సినిమాలో కబడ్డీ ప్లేయర్ గా కనపడే మహేశ్ కి అప్పటికి కబడ్డీ ఆడడమే రాదట..దాంతో కబడ్డీ ఆటను ప్రాక్టీస్ చేసి మరీ క్లైమాక్స్ సీన్లో ఆడారట…భూమిక,ప్రకాశ్ రాజ్,తెలంగాణాశకుంతల,గీత,ముకేష్ రుషి తారాగణంతో వచ్చిన ఈ సినిమాలో ఎవరికి వారే తమ పాత్ర ప్రాధాన్యం మేరకు నటించారు.అజయ్ గా మహేశ్ నటిస్తే,మహేశ్ అమ్మానాన్న గా గీతా,ముఖేశ్ రుషిలు నటించారు.విలన్ గా మంచి ఫామ్ మీదున్న ముఖేశ్ రుషిని పాజిటివ్ రోల్లో చూపించారు ఈ సినిమాలో..వారిలో చెప్పుకోవాల్సింది ఆశ క్యారెక్టర్.అజయ్ సిస్టర్ క్యారెక్టర్..అల్లరికి కేరాఫ్ అడ్రస్ గా,అన్నయ్యను ఆటపట్టించే అల్లరిపిల్లగా నటించిన ఆశ అసలు పేరు నిహారికా..ఆ సినిమా తర్వాత ఆశ అలియాస్ నిహారికా పెద్దగా సినిమాలు చేయలేదు..

ఈ మధ్య సోషల్ మీడియాలో నిహారిక ఫోటోస్ హల్ చల్ చేస్తున్నాయి.చాలా అందంగా ఉండడమే కాదు,ఆ ఫోటోలు చూస్తుంటే సినిరంగంలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిందేం లేదు..అంత అందంగా ఉంది.అయినా చైల్డ్ ఆర్టిస్టులుగా చేసినవాళ్లు ఎంతమంది హీరోహీరోయిన్లుగా ఎంట్రీ ఇవ్వలేదూ..ఆ నాటి శ్రీదేవి ,కమల్ నుండి నేటి రాశి,తరుణ్,ఊర్మిళా వీళ్లంతా కూడా బాల్యనటులుగా వచ్చినవాళ్లే..నిహారిక ఆల్ ది బెస్ట్.. అప్పటి ఆశ…ఇప్పటి నిహారికా ఎలా ఉందో మీరే చూడండి.

Comments

comments

Share this post

scroll to top