ఒకే గోత్రం ఉన్న వారు పెళ్లి చేసుకుంటే ఏమవుతుందో తెలుసా..? అసలు “గోత్రం” అంటే ఏమిటి..?

హిందువులకు అందరికి గోత్రం అనేది ఉంటుంది..గోత్రానికి ,ఇంటి పేరుకి సంభందం ఉండదు..ఈ గోత్రం అనే పదాన్ని మనం ఎక్కువగా గుళ్లల్లో వింటూ ఉంటాం..పూజ చేయించేప్పుడు మన ఇంటిపేరుతో కాకుండా గోత్రనామంతో అర్చన జరుపుతారు పూజారులు..అదేవిధంగా వివాహ సమయంలో గోత్ర ప్రస్తావన వస్తుంది.ఒకే గోత్రం కలిగిన వారికి పెళ్లిల్లు చేయకూడదు అనే మాట మనం వింటుంటాం..అసలు ఈ గోత్రం అంటే ఏంటి..ఎక్కడినుండి వచ్చింది..ఎందుకు ఒకే గోత్రికులు పెళ్లి చేసుకోవద్దంటారు..ఆ వివరాలు..

పూర్వ కాలంలో ఒక కుటుంబంకు చెందిన వారికి విద్యలను నేర్పించేందుకు గురువులు ఉండేవారు. వారి కుటుంబ గురువు పేరును గోత్రంగా మార్చుకున్నారు. కొందరు విద్యను అభ్యసించని వారు వారి పూర్వికుల పేర్లు లేదా వారి వంశం యొక్క మూల పురుషుడి పేరును గోత్రంగా తీసుకున్నారు.అలా గోత్రాలు కొనసాగుతూ వస్తున్నాయి. ఒకే గోత్రం కలిగిన వారు పెళ్లి చేసుకునేందుకు అనర్హులని హిందు ధర్మ చెబుతోంది.

హిందూ ధర్మ ప్రకారం ఒకే గోత్రం కలిగి ఉన్న వారు అన్నా తమ్ముడు లేదా అన్నా చెల్లి అవుతారు. రక్త సంబంధీకులు హిందు ధర్మం ప్రకారం పెళ్లి చేసుకోరాదు. అందుకే ఒకే గోత్రం ఉన్న వారు పెళ్లి చేసుకోవద్దని అంటూ ఉంటారు. ఒకే గోత్రం ఉన్న అమ్మాయి అబ్బాయి అక్కా తమ్ముడు లేదా అన్నా చెల్లి వరుసలు అవుతారు. పరిచయం లేకున్నా కూడా పూర్వంలో ఏదో ఒక చోట బంధుత్వం ఉండి ఉంటుంది.ప్రపంచంలో ఏ హిందువులకు కూడా సంబంధం లేకుండా ఒకే గోత్రం ఉండదు. గోత్రం కలిసిందంటే సంవత్సరాల క్రితం అయినా వారికి రక్త సంబంధం ఉండి ఉంటుంది. అందుకే గోత్రాలు ఒక్కటి అయిన వారు పెళ్లి చేసుకోవద్దు అని చెబుతుంటారు. దీన్నే మన సైన్స్ పరిభాషలో చెప్పుకుంటే.

రక్త సంబంధీకుల్లో ఒకేరకమయిన జీన్స్ ఉంటాయి. అంటే వారి డీఎన్ఏ ఒక్కటే అన్నమాట. వారి లక్షణాలు ఒక్కటిగానే ఉంటాయి. అంతేకాదు ఒకే రక్త సంబంధీకులు పెళ్లిళ్లు చేసుకుంటే క్రోమోజోములు క్లాష్ అయ్యి జన్యుపరమైన వ్యాధులు వస్తాయి. మేనరిక వివాహాల్లో ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం కదా.. పిల్లలు వైకల్యం, బుద్ది మాంధ్యంతో పుట్టడం వంటివి జరుగుతున్నాయి. సో ఒకే గోత్రీకులు పెళ్లి చేసుకోరాదన్న మన పూర్వీకుల నిబంధన నూటికి నూరుపాళ్లూ నిజం.

 

Comments

comments

Share this post

scroll to top