ఒకప్పుడు భార్య శవాన్ని ఎత్తుకొని నడిచాడు..ఇప్పుడు అదే దారిలో బైక్ పై.! లక్షాధికారి ఎలా అయ్యాడంటే..?

పేదరికం, భార్య శవాన్ని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్లడానికి  డబ్బులు లేనంత పేదరికం, ఆస్పత్రి వాళ్లు అంబులెన్స్ ఇవ్వక, భార్య శవాన్ని భుజంమీద వేసుకుని పది కిలోమీటర్లు నడిచిన భర్త గుర్తున్నాడా..ఒడిషాకు చెందిన  ధనా మాఝీ దీనగాథ ,ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది..అప్పుడు ఫోటోలు,వారి పరిస్థితికి చాలామంది కదిలిపోయారు. పేదరికంలో ఉన్న అతన్ని ఆదుకోవాలని చాలా మందే అనుకున్నారు. కొంతమంది సాయం చేశారు. ప్రభుత్వం సైతం అందుకు కారణమైన అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది.అలాంటి మాఝీ, ఇప్పుడు లక్షాధికారిగా మారిపోయాడు.సొంత ఇల్లు , కొత్త  బైక్ కొనుక్కుని, పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తున్నాడు.ఇంత మార్పు ఎలా వచ్చింది అనుకుంటున్నారా…ఒకసారి గతంలోకి వెళ్లొద్దాం…

ఒడిశాలోని కలహండి జిల్లా లో ధనామాఝీ తన కుటుంబంతో సహా ఉండేవాడు. అతని భార్య అనారోగ్యానికి గురై ఆస్పత్రిలోనే చనిపోయినా, ఇంటికి తీసుకెళ్లేందుకు ఆ హాస్పిటల్ వాళ్లు కనీసం అంబులెన్స్ కూడా ఇవ్వలేదు. దీంతో, చేసేదేమీ లేక, కూతుర్ని వెంటేసుకుని, భార్య మృతదేహాన్ని పది కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటికి నడుచుకుని వెళ్లాడు. ఇలాంటి హృదయవిదారక ఘటన చూసి, దేశవ్యాప్తంగా అందరూ చలించిపోయారు. అప్పట్లో సోషల్ మీడియాలో ఈ వార్త సంచలనం సృష్టించింది. అయితే ఈ న్యూస్ ఆ నోటా ఈ నోటా, బహ్రెయిన్ ప్రధానమంత్రి, రాజు ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా కు చేరింది. అతని పరిస్థితికి చలించిపోయిన బహ్రెయిన్ రాజు 9 లక్షల చెక్కును  మాఝీకి పంపించారు. ఆయనతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న అనేక స్వచ్ఛంద సంస్థలు, మాంఝీకి ఆర్థిక సాయం చేశాయి. వీరందరి సాయంతో, మాఝీ జీవితం మారిపోయింది.అతనికున్న ముగ్గురు కూతుళ్లు, మంచి రెసిడెన్షియల్ స్కూల్లో ఫ్రీగా చదువుకుంటున్నారు. తనకున్న కొంత పొలాన్ని సాగు చేసుకుంటున్నాడు.

భారత ప్రభుత్వం ప్రధానమంత్రి గ్రామీణ్ ఆవాస్ యోజన కింద అతనికి కొత్త ఇంటిని మంజూరు చేసింది. ప్రస్తుతం ఆ ఇల్లు నిర్మాణ దశలో ఉంది,మరోవైపు  తనకు వచ్చిన డబ్బంతటినీ, కూతుళ్ల చదువులు, పెళ్లిళ్ల కోసం ఫిక్సెడ్ డిపాజిట్ చేశాడు. తనకున్న కొద్ది పాటి పొలాన్ని సాగు చేసుకుంటూ, మరో పెళ్లి చేసుకున్నాడు. తాజాగా ఒక బైక్ కూడా కొనుక్కున్నాడు. ఒకప్పుడు భార్య శవాన్ని తీసుకెళ్లిన అదే రోడ్డుపై, నేడు బైక్ మీద తిరుగుతున్నాడు. మనిషికి మనిషి ఆసరాగా నిలబడితే, ఇలాంటి మాఝీలు ఎంతో మంది జీవితాల్లో సమూల మార్పులు సాధించుకోవచ్చు.దీనికోసం కొంచెం మానవత్వం ఉంటే చాలు..

Comments

comments

Share this post

scroll to top