ఇప్పుడు హీరోయిన్ లా మారిన ఆమె..ఒకప్పుడు టాయిలెట్స్ కడిగింది తెలుసా.? ఇంతకీ ఆమెవరు?

ఈ మ‌ధ్య కాలంలో ఇంట‌ర్నెట్‌లో హీరోయిన్ మ‌హిరాఖాన్ ఫొటో ఒక‌టి తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది చూశారా..? అవును, అదే. హీరో ర‌ణ‌బీర్ క‌పూర్‌తో న్యూయార్క్‌లో పొగ తాగుతున్న‌ప్పుడు ఎవ‌రో ఆమె ఫొటో తీశారు. అనంతరం దాన్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముందీ, ఆ ఫొటో కాస్తా ఇప్పుడు తెగ వైర‌ల్ అవుతోంది. ఈ క్రమంలో ఆ ఫొటోను చూసిన చాలా మంది నెటిజ‌న్లు మ‌హిరాఖాన్‌ను విమ‌ర్శిస్తున్నారు. ఆమె అలా పొగ‌తాగ‌డాన్ని అభిమానులు త‌ప్పు ప‌డుతున్నారు. స‌రే.. ఈ విషయంలో ఎవ‌రి వైఖ‌రి ఎలా ఉన్నా… నిజానికి మ‌హిరాఖాన్‌ను నేటి త‌రం వారు ఓ విష‌యంలో ఆద‌ర్శంగా తీసుకోవాల్సిందే. అదేమిటంటే…

ఇప్ప‌డంటే మ‌హిరాఖాన్ ఫేమ‌స్ న‌టి అయింది. కానీ ఒక‌ప్పుడు ఆమె చాలా క‌ష్టాలు ప‌డింది తెలుసా..! ఆమెది పాకిస్థాన్‌. అయితే ఆమె క‌ష్ట‌ప‌డి చ‌దివేది. అందులో భాగంగానే ఆమె క‌రాచీలో విద్యాభ్యాసం పూర్తికాగానే యూనివ‌ర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో చాలా క‌ష్ట‌ప‌డి సీటు సాధించింది. అయితే అక్క‌డ ఆమె ఖ‌ర్చుల‌కు డ‌బ్బు ఉండేది కాదు. దీంతో ఆమె బాత్‌రూంల‌ను క‌డిగేది. ఇండ్ల‌లో చీపురుతో ఊడ్చే ప‌ని చేసేది. అలా ఆమె క‌ష్ట‌ప‌డి చ‌దువుతూ ఉండ‌గా, అనుకోకుండా ఆమెకు న‌టిగా ఆఫ‌ర్లు వ‌చ్చాయి.

దీంతో మ‌హిరాఖాన్ చ‌దువుకు ఫుల్‌స్టాప్ పెట్టి న‌టిగా కొన‌సాగింది. ఈ క్ర‌మంలోనే 2007లో పాకిస్థాన్‌కు చెందిన అలీ అనే వ్య‌క్తిని మ‌హిరా వివాహం చేసుకుంది. కానీ ఈ వివాహం ఆమె త‌ల్లిదండ్రుల‌కు ఇష్టం లేదు. ఈ క్ర‌మంలో వీరికి ఓ కుమారుడు జ‌న్మించాడు. అయితే మ‌హిరా త‌న భ‌ర్త నుంచి 2015లో విడాకులు తీసుకుంది. అనంత‌రం మ‌హిరాకు బాలీవుడ్‌లో ఆఫ‌ర్లు వ‌చ్చాయి. ఆమె షారుక్ ఖాన్ స‌ర‌స‌న రాయిస్ అనే చిత్రంలో న‌టించింది. దీంతో ఒక్క‌సారిగా మ‌హిరా పేరు వెలుగులోకి వ‌చ్చింది. కానీ ఈ మ‌ధ్య ఆమె అలా ర‌ణ‌బీర్ క‌పూర్‌తో పొగ తాగుతుండ‌గా తీసిన ఫొటోతో విమ‌ర్శ‌ల పాల‌వుతోంది. అయినా వారికి ఇలాంటివ‌న్నీ స‌హ‌జ‌మే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top