వాట్సాప్ లో ఒక రాంగ్ మెసేజ్…వారిద్దరి పెళ్లి చేసింది.! ఇంతకీ ఆ మెసేజ్ ఏంటి.? అసలు ఏమైంది.?

వాట్సప్లో తెలియని నంబర్ నుండి మెసేజ్ వస్తే ఎవరైనా ఏం చేస్తారు..ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం..ఎందుకు మెసేజ్ చేసారో కనుక్కుంటాం..లేదంటే ఇగ్నోర్ చేస్తాం..పెళ్లి చేసుకుంటామా?? చేసుకున్నారు ఒక జంట.వాట్సప్లో రాంగ్ మెసేజే ఈ జంటను కలిపింది..వాట్సప్లో వచ్చిన రాంగ్ మెసేజ్ తర్వాత జరిగిన సంభాషణ..వీరిద్దరి మనసులు కలవడం,ముడి పడడం చకచకా జరిగిపోయాయి.కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు సరిగ్గా అలాగే మెసేజ్ వచ్చింది పెళ్లి అయింది…ఇప్పుడు ఎంచక్కా డ్యూయెట్లు పాడుకుంటున్నారు కూడా…ఇంతకీ వారెవరు..వారిమధ్య జరిగిన సంభాషణ ఏంటి…

దక్షిణ లండన్‌లోని కొలియర్స్‌ వుడ్‌కు చెందిన మైఖేల్‌ వయసు 44. ఒకరోజు పొరపాటున ‘గర్ల్స్‌ ట్రిప్‌’ అంటూ ఒక మెసేజ్‌ వాట్సాప్‌లో పంపించాడు.  ‘గర్ల్స్‌ ట్రిప్పా? ఎవరు మీరు? మీరు అనుకుంటున్న లీనా నేను కాదోమో’ అంటూ అవతలినుండి సమాధానం వచ్చింది.తనకు తెలిసిన లీనా అనే ఒక యువతి ఫొన్‌ నంబర్‌ అనుకొని.. ఈ మెసేజ్‌ పెట్టాడు. కానీ, ఆ మెసేజ్‌ లీనా డాహ్ల్‌బెక్‌కు వెళ్లింది.లీనా వయసు 37. వారు అంతకుముందు కలువకపోయినా..ఒకరికి ఒకరు ముఖపరిచయం లేకపోయినా.. వాట్సాప్‌లో మాత్రం వారి సంభాషణ చాలా సరదాగా సాగిపోయింది.

ఛాట్ చేసుకునేది ఫస్ట్ టైం అయినా ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకుంటున్నవారిలా గంటల తరబడి సాగింది.అలా ఆ ఛాటింగ్ ద్వారానే ఇద్దరు మాటలు కలిసి..ఒకరి  అభిరుచులు మరొకరికి  తెలియడంతో ఇద్దరూ డేటింగ్‌ చేయాలనుకున్నారు. సాయంత్రం రెస్టారెంట్‌లో డిన్నర్‌ పార్టీలో ఇద్దరూ కలిశారు. ఇద్దరు ఒంటరివారే కావడంతో మనసులోని మాటలు పంచుకొని.. ప్రేమను తెలుపుకొని ఒక్కటయ్యారు. గత ఏడాది డిసెంబర్‌ 7న ఇద్దరు పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలో అడుగపెట్టారు. మేకప్‌ ఆర్టిస్ట్‌ అయిన లీనా దుబాయ్‌లో మేకప్‌ స్కూల్‌ ప్రారంభించాలనుకుంటోంది. ఇందుకోసం నూతన దంపతులు ఈ నెలలో దుబాయ్‌ వెళుతున్నారు.పనిలో పనిగా హనీమూన్ ట్రిప్ కూడా కానిచ్చేస్తారేమో…

Comments

comments

Share this post

scroll to top