ఒక స్త్రీని చూస్తే మ‌రొక స్త్రీకి అసూయ ఎందుకు క‌లుగుతుందో తెలుసా..? 5 కారణాలు ఇవే..!

ప్ర‌పంచంలో ఉన్న ప్ర‌తి ఒక్క వ్య‌క్తికి ఎవ‌రో ఒకరిపై ద్వేషం ఉంటుంది. వారిని చూస్తే జ‌ల‌స్‌గా ఫీల‌వుతారు. అయితే ఒక పురుషున్ని చూస్తే మ‌రో పురుషుడికి క‌లిగే జ‌ల‌స్ క‌న్నా ఒక స్త్రీని చూస్తే మ‌రో స్త్రీకి క‌లిగే జ‌ల‌స్ ప్ర‌భావమే ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. అలా అని మేం చెప్పడం లేదు. అధ్య‌య‌నాలే చెబుతున్నాయి. అయితే నిజానికి ఇలా ఒక స్త్రీని చూస్తే మ‌రొక స్త్రీకి ఈర్ష్య‌గా, అసూయ‌గా ఎందుకు ఉంటుందో తెలుసా..? అందుకు ప‌లు కార‌ణాలు ఉన్నాయి. అవేమిటంటే.

1. ఒక స్త్రీని చూస్తే మ‌రొక స్త్రీకి జ‌ల‌స్‌గా ఎందుకు ఉంటుందంటే.. అది వారి త‌ప్పు కాదు. వారిలో ఉండే హార్మోన్లు ఆ ప‌ని చేస్తాయి. అవి వారి మూడ్‌ను మారుస్తాయి. దీంతో స‌హ‌జంగానే అవ‌త‌లి స్త్రీపై మ‌రో స్త్రీకి ద్వేషం క‌లుగుతుంది.

2. పురుషుల‌తో క్లోజ్‌గా మూవ్ అయ్యే స్త్రీల‌ను చూస్తే కొంద‌రు స్త్రీల‌కు జ‌ల‌స్ క‌లుగుతుంది. అది కూడా హార్మోన్స్ ప్ర‌భావ‌మే. త‌మ‌కు అలాంటి సౌక‌ర్యం ద‌క్క‌లేదే అన్న భావ‌న ఇంట‌ర్న‌ల్‌గా ఉంటుంది. అది వారికే తెలియ‌దు. కానీ అది జ‌ల‌స్ రూపంలో బ‌య‌ట‌కు వ‌స్తుంది.

3. ఒక స్త్రీని చూస్తే మ‌రొక స్త్రీకి ఈర్ష్య క‌ల‌గ‌డానికి కార‌ణం వారిలో ఉండే ఈస్ట్రోజ‌న్ అనే హార్మోన్‌. నెల‌స‌రి స‌మ‌యంలో ఇది ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంది. దీంతో ఆ స‌మయంలో మ‌రింత ద్వేషంగా ఉంటారు. దీన్ని ప్ర‌యోగాల ద్వారా నిరూపించారు కూడా.

4. ఒక స్త్రీకి ఉన్న అందం, డ‌బ్బు వంటి గుణాలు కూడా ఇత‌ర స్త్రీల‌కు వారిపై అసూయ‌కు కార‌ణ‌మ‌వుతాయి.

5. పైన చెప్పిన‌వే కాకుండా ఇత‌ర స్త్రీల‌కు త‌మ త‌మ ఇండ్ల‌లో ల‌భించే స‌దుపాయాలు, భ‌ర్త ఆద‌ర‌ణ‌, చ‌క్క‌ని పిల్ల‌లు, కుటుంబ స‌భ్యుల స‌ఖ్య‌త వంటి అనేక అంశాలు కూడా ఒక స్త్రీపై మ‌రొక స్త్రీకి అసూయ ఉండేందుకు కార‌ణాలు అవుతాయి.

Comments

comments

Share this post

scroll to top