ఒకబ్బాయి, ఇద్దరమ్మాయిలతో కలిసి… సినిమా థియేటర్ లో కనబడితే జనాలు ఏమనుకుంటారో తెలుసా?

ఏం చేయాలన్నా…లోకానికి భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.  వాస్తవంతో సబంధం లేకుండా వాళ్లు ఒకటి ఫిక్స్ అయిపోతారు. అదే కరెక్ట్ అని ముద్ర గుద్ది మరీ  ఫ్రీ పబ్లిసిటీ కూడా చేసేస్తారు. అలాంటి జనాలు…ఒక అబ్బాయి ఇద్దరమ్మాయిలతో సినిమా థియేటర్ లో కనబడితే ఏలా అనుకుంటారు అని చిన్న డౌట్ వచ్చింది. అదే డౌట్ ను ఫ్రెండ్స్ ముందు పెడితే వాళ్లిచ్చిన సమాధానాలు ఇవి…వీళ్లు కూడా అలాగే అనుకుంటారట మరి!

  • మనోడి మీద ఆ అమ్మాయికి నమ్మకం లేదనకుంటా..అందుకే సెక్యురిటిగా మరో అమ్మాయిని తీసుకొచ్చుకుంది.
  • ఇద్దరమ్మాయిల ధాటికి బకరా గాడు బలి.
  • మనకు ఇక్కడ ఒక్కరే గతి లేరంటే…వీడెవడ్రా..ఇద్దరిద్దర్ని మెయింటేన్ చేస్తున్నాడు.
  • వీడి జేబుకు పెద్ద చిల్లు గ్యారెంటీ….నెల జీతం ఒక్క రోజే ఖతం అవుతుందిరోయ్.
  • ఇంటి దగ్గర ఫ్రెండ్ తో సినిమాకి అని కవరింగ్…ఇక్కడ ఇలా కలరింగ్.!
  • ఇంతకీ ఇద్దర్లో….ఎవరు మనోడికి క్లోజ్ అబ్బా…!!
  • మనోడు మధ్యలో కూర్చుంటాడా ? లేక లవర్ పక్కనా?
  • ఆ అమ్మాయిల ఫేస్ చూడు, వీడి ఫేస్ చూడు….ఇలాంటోళ్లకే పడతారేందిరా ఈ అమ్మాయిలు.!?
  • 2-i-n1

వెంట వచ్చింది…ఎవరు అనికూడా ఆలోచించకుండా….ఇన్ని గాసిప్స్ ను గుప్పుమనిపిస్తారన్న మాట జనాలు. చివరిగా ఒకమాట…ఎవరు ఏమనుకున్నా….మన ఆలోచనల్లో తప్పులేనంత వరకు మన ఆటిట్యూడ్ లో ఛేంజ్ అవసరం లేదు…మనం ఎవరకి భయపడాల్సిన అవసరం లేదు . జస్ట్ ఓ మాట…లోకులు కాకులు..కావ్ కావ్ కావ్ వ్ వ్ వ్ ఇదే వారి పని.

Comments

comments

Share this post

scroll to top