కొబ్బ‌రినూనెతో ఆయిల్ పుల్లింగ్‌ను మీరెప్పుడైనా ట్రై చేశారా..? దాంతో ఎలాంటి లాభాలు క‌లుగుతాయంటే..?

ఆయిల్ పుల్లింగ్‌..! ఈ ప‌దాన్ని మీరు వినే ఉంటారు. చాలా మంది ఈ ప‌దాన్ని హాస్యం స్ఫురించేందుకు వాడుతారు. అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోయేది మాత్రం హాస్యం కాదు. ఆరోగ్యానికి సంబంధించింది. అవును, మీరు విన్నది క‌రెక్టే. ఆయిల్ పుల్లింగ్ అంటే చాలా మంది జోక్ అనుకుంటారు. కానీ దాంతో మ‌న‌కు లాభాలే క‌లుగుతాయి. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు పోతాయి. అవేమిటో, అస‌లు ఆయిల్ పుల్లింగ్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఆయిల్ పుల్లింగ్‌ను ఏ ఆయిల్‌తో అయినా చేయ‌వ‌చ్చు. ఆలివ్ ఆయిల్‌, నువ్వుల నూనె… ఇలా ఏ ఆయిల్‌నైనా అందుకు ఉప‌యోగించ‌వ‌చ్చు. అయితే కొబ్బ‌రినూనె అయితే మిక్కిలి శ్రేయ‌స్క‌రంగా ఉంటుంది.

2. ఉద‌యాన్నే కాల‌కృత్యాలు తీర్చుకున్నాక‌, బ్ర‌ష్ చేయ‌క‌ముందు ఒక టేబుల్ స్పూన్ మోతాదులో కొబ్బ‌రి నూనె తీసుకుని నోట్లో పోసుకోవాలి. నోటిలో పుక్కిలించేందుకు వీలున్నంత వ‌ర‌కు కూడా కొబ్బ‌రినూనె నోట్లో పోసుకోవ‌చ్చు. అలా చేశాక ఎవ‌రి వీలును బ‌ట్టి వారు 5 నుంచి 20 నిమిషాల పాటు నోరు తెర‌వ‌కుండా నోట్లో ఆయిల్‌ను అలాగే పుక్కిలించాలి. అనంత‌రం ఆయిల్‌ను ఊసేయాలి. ఎట్టి పరిస్థితిలోనూ ఆ ఆయిల్‌ను మింగ‌కూడ‌దు. ఆయిల్ పుల్లింగ్ అయ్యాక య‌థావిధిగా బ్ర‌షింగ్ చేసుకోవాలి.

3. పైన చెప్పిన విధంగా రోజూ ఆయిల్ పుల్లింగ్ చేయ‌డం వల్ల నోటి స‌మ‌స్య‌లు పోతాయి. దంతాలు తెల్ల‌గా మారుతాయి.

4. నోటి దుర్వాస‌న పోతుంది. ఉద‌యాన్నే ఎక్కువ మొత్తంలో నోట్లో ఉండే క్రిములు బ్ర‌షింగ్ ద్వారా పోవు. కానీ ఆయిల్ పుల్లింగ్ వ‌ల్ల ఆ క్రిములు పోతాయి. ఎందుకంటే కొబ్బ‌రినూనెలో స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్ ల‌క్ష‌ణాలు ఉన్నాయి. ఇవి క్రిముల భ‌ర‌తం ప‌డ‌తాయి. అందుకే ఆయిల్ పుల్లింగ్ చేస్తే చాలా క్రిములు న‌శిస్తాయి.

5. పెద్ద ఎత్తున క్రిములు న‌శించ‌డం వ‌ల్ల రోజంతా మనం ఏం తిన్నా సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు. జీర్ణాశ‌యంలోకి ఎలాంటి క్రిములు పోవు. పోయినా అవి బ‌త‌క‌వు.

6. శ‌రీరంలో ఉన్న వ్య‌ర్థాలు బ‌య‌టికి వెళ్లిపోతాయి. శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్ర‌మ‌వుతుంది.

7. నోటి క్యాన్స‌ర్ రాకుండా ఉంటుంది. గుట్కాలు వంటివి తినేవారు నోరు స‌రిగ్గా తెర‌వ‌లేరు. అలాంటి వారు ఆయిల్ పుల్లింగ్ ప్రాక్టీస్ చేస్తే నోరు మ‌ళ్లీ య‌థాస్థితికి చేరేందుకు అవ‌కాశం ఉంటుంది. అప్పుడు ఏ ఇబ్బందీ అనిపించ‌దు.

8. ఆయిల్ పుల్లింగ్ వ‌ల్ల నోటికే కాదు, ద‌వ‌డ‌ల‌కు, ముఖానికి చ‌క్క‌ని వ్యాయామం అవుతుంది. దీంతో ఆ ప్రాంతం చ‌క్క‌ని ఆకృతిని పొందుతుంది.

9. నోటి పూత ఉంటే త‌గ్గిపోతుంది. తినే ఆహార ప‌దార్థాల రుచి బాగా తెలుస్తుంది. రుచిమొగ్గ‌ల‌కు శ‌క్తి చేకూరుతుంది.

10. దంతాల మ‌ధ్య ఇరుక్కున్న ప‌దార్థాలు పోతాయి. దంతాలు క్ష‌యం కాకుండా ఉంటాయి.

Comments

comments

Share this post

scroll to top