ఆఫీస్ బాయ్ గా పనిచేస్తూ…EM-CET లో 7 వేల ర్యాంక్.! చదవుకోడానికి డబ్బుల్లేక వదులుకోవాలనుకుంటున్న సీట్.!

ఫోటోలోని ఈ కుర్రాడి పేరు సాయిబాబు. తెలంగాణ స్టేట్ నిర్వహించిన EM-CET పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 7  వేల ర్యాంక్ సాధించాడు. BC-A కేటగిరీ కి చెందిన వాడు, కౌన్సెలింగ్ కు  వెళ్తే  మంచి పేరున్న  కాలేజ్ లో సీట్ వచ్చే అవకాశం ఉంది.  కానీ చదవడానికి డబ్బులేని కారణంగా మంచి కాలేజ్ లో సీటు ను వదులుకోడానికి సిద్దమయ్యాడు ఈ కుర్రాడు. మొదటి నుండి చదువుల్లో ముందువరుసలో ఉండే సాయిబాబది…ఆర్థికంగా మాత్రం అంతంతమాత్రమే అయిన కుటుంబమే.!

20 యేళ్లుగా హైద్రాబాద్ లో నివాసం ఉంటున్న సాయిబాబ కుటుంబానిది రెక్కాడితేకానీ డొక్కాడని పరిస్థితి. సాయిబాబ తల్లి…. రెండు,మూడు ఇండ్లలో పని చేస్తూ వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తుంది.  తల్లి పరిస్థితిని గమనించిన సాయిబాబ….తమ సమస్యలన్నింటికీ చదువే పరిష్కారం అని అలుపెరగని శ్రమ చేశాడు…ఈ క్రమంలో పదవతరగతిలో 9.3 GPAను సాధించాడు, ఇంటర్ లో 96% మార్కులతో తన సత్తా చాటాడు. ఆ యేడాదే EM-CET పరీక్ష రాస్తే 13 వేల ర్యాంక్ వచ్చింది.

చదువుకు, పుస్తకాలకు సంవత్సరానికి లక్షకు పైగా ఖర్చవుతుందని  మంచి ర్యాంక్ వచ్చినా కాలేజ్ లో జాయిన్ అవ్వలేదు. ఇంకా కష్టపడి 2000 లోపు ర్యాంక్ తెచ్చుకొని ప్రభుత్వ కాలేజ్ లలో జాయిన్ అవ్వవాలని ఆ అవకాశాన్ని వదులుకున్నాడు.  తర్వాత కుటుంబ పరిస్థితులు మరీ దుర్భంగా మారాయి…..ఇక తప్పదనుకున్నాడు ..ఓ ఆఫీస్ లో ఆఫీస్ బాయ్ గా చేరి కుటుంబానికి ఆసరాగా మారాడు. అయినా తన లక్ష్యాన్ని మాత్రం ఒదులుకోలేదు.. ఓ వైపు పని, మరోవైపు చదువు…..ఎటువంటి కోచింగ్ లేకుండా ఈ సారి రాష్ట్ర స్థాయిలో 7 వేల ర్యాంక్ ను సాధించాడు సాయిబాబా.

talent

ఇప్పుడు కూడా ఈ కుర్రాడిది అదే ఆలోచన…చదివే స్తోమత లేదు. ఎవరైనా దాతలు సహకరిస్తే…. కాలేజ్ లో చేరతానని సవినయంగా ప్రార్థిస్తున్నాడు సాయిబాబా.

10 వేల లోపు ర్యాంక్ వస్తే నీకు నచ్చిన బైక్ కొనిస్తా అనే తల్లీదండ్రుల  ప్రోత్సాహకాలు ఓ వైపు…..  20 వేల లోపు ర్యాంక్ రావాలంటే మంచి కోచింగ్ సెంటర్ లో చేరాలి అంటూ లక్షలకు లక్షలు ఫీజులు కట్టించి చదివించే పేరెంట్స్ మరోవైపు……ఇవేవీ లేకుండా సొంతంగా తన సత్తా చాటిన సాయిబాబా ను దయాహృదయులైన వారు ఆదుకుంటే బాగుంటుంది.  దేశానికి భవిష్యత్ ఇంజనీర్ అందించిన వారిగా, ఓ సరస్వతీ పుత్రుడికి సహాయం చేసే వారిగా నిలిచే అవకాశం మీ ముందుంది.

Contact : 

Sai Baba:  9392964606

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top