ఏయే రాశి వారు ఏయే ప‌దార్థాల‌ను నైవేద్యంగా రామునికి పెడితే శుభం క‌లుగుతుందో తెలుసా..?

శ్రీ‌రామ న‌వ‌మి..! హిందువుల‌కు చాలా ముఖ్య‌మైన పండుగ ఇది. ఈ రోజున శ్రీ‌రాముడు జ‌న్మించ‌డ‌మే కాదు, ఆయ‌న‌కు వివాహం కూడా జ‌రిగింది. అందుకే ఈ పండుగ రోజున శ్రీ‌రాముని పుట్టిన రోజుతోపాటు స‌ర్వ‌త్రా ఆయ‌న క‌ల్యాణం కూడా జ‌రుపుతారు. అయితే ఈ రోజున భ‌క్తులు కూడా వారి స‌మ‌స్య‌ల‌ను పోగొట్టుకోవ‌చ్చు. అదెలాగంటే… కింద చెప్పిన విధంగా 12 రాశుల వారు త‌మ రాశి ప్ర‌కారం ప‌లు రకాల తీపి ప‌దార్థాల‌ను శ్రీ‌రాముడికి నైవేద్యంగా పెడితే చాలు. దాంతో భ‌క్తులు త‌మ క‌ష్టాల‌ను తొల‌గించుకోవ‌చ్చు. ఈ క్రమంలో ఏయే రాశి వారు ఏయే తీపి ప‌దార్థాల‌ను నైవేద్యంగా పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం…
ఈ రాశి వారు శ్రీ‌రామ‌న‌వ‌మి రోజున రామునికి దానిమ్మ పండు లేదా ల‌డ్డూల‌ను నైవేద్యంగా స‌మ‌ర్పించాలి. దీంతో స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

వృషభం…
ఈ రాశి వారు శ్రీ‌రామునికి ర‌స‌గుల్లాల‌ను నైవేద్యంగా స‌మ‌ర్పించాలి. ఇలా చేస్తే వారికి రాముని అనుగ్ర‌హం ల‌భిస్తుంద‌ట‌.

మిథునం…
ఈ రాశి క‌లిగిన వారు కాజు బ‌ర్ఫీని నైవేద్యంగా స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. దీంతో వారికి ఉన్న అన్ని స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయ‌ట‌.

క‌ర్కాట‌కం…
ఈ రాశి వారు కొబ్బ‌రి బ‌ర్ఫీ లేదా మేవా బ‌ర్ఫీని నైవేద్యంగా పెట్టాల్సి ఉంటుంది. అలా చేస్తే స‌మ‌స్య‌ల నుంచి బ‌యట ప‌డ‌వ‌చ్చు.

సింహం…
బెల్లం లేదా బిల్వ పండ్ల‌ను రామునికి నైవేద్యంగా పెట్టాల్సి ఉంటుంది. అలా చేస్తే అనుకున్న‌వి నెర‌వేరుతాయ‌ట‌.

క‌న్య‌…
ఈ రాశి వారు ఆకుప‌చ్చ‌ని రంగులో ఉండే ఏ పండునైనా శ్రీ‌రామ‌న‌వమి రోజ‌న రామునికి నైవేద్యంగా పెట్ట‌వ‌చ్చ‌ట‌. దీంతో వారికి కెరీర్ ప‌రంగా ఉండే స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయ‌ట‌.

తుల…
ఈ రాశి వారు క‌లాకంద్ లేదా యాపిల్ పండ్ల‌ను నైవేద్యంగా అర్పించాలి. దీంతో వీరికి రాముని ఆశీస్సులు ల‌భిస్తాయి.

వృశ్చికం…
బెల్లంతో చేసిన ఏదైనా తీపి ప‌దార్థాన్ని ఈ రాశి వారు రామునికి పెట్టాలి. దీంతో వీరికి ఉండే క‌ష్టాల‌న్నీ ఇట్టే పోతాయ‌ట‌.

ధ‌నుస్సు…
శ‌న‌గ‌పిండితో చేసిన ఏ తీపి ప‌దార్థాన్ని అయినా ఈ రాశి వారు రామునికి పెట్ట‌వ‌చ్చు. ఇలా చేస్తే స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి.

మ‌క‌రం…
నేరేడు పండ్లు, న‌ల్ల ద్రాక్ష‌ల‌ను ఈ రాశి వారు రామునికి నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేస్తే వారు స‌మ‌స్య‌ల నుంచి గ‌ట్టెక్కుతారు.

కుంభం…
ఈ రాశి వారు రామునికి స‌పోటా పండ్ల‌ను నైవేద్యంగా పెట్టాల్సి ఉంటుంది. దీంతో వీరికి వ్యాపార రంగంలో తిరుగుండ‌ద‌ట‌.

మీనం…
జిలేబీలు, అర‌టి పండ్లను ఈ రాశి వారు రామునికి అర్పించాలి. అప్పుడు వ్యాపారం, కెరీర్ బాగుంటుంది.

Comments

comments

Share this post

scroll to top