సాయిబాబా అనుగ్ర‌హం పొందాలంటే గురువారం నాడు వీటిని స‌మ‌ర్పించాల‌ట‌..!

కోరిన కోర్కెలు తీర్చి, క‌ష్టాల నుంచి గ‌ట్టెక్కించే ఇష్ట‌దైవంగా సాయిబాబాను చాలా మంది భ‌క్తులు నమ్ముతారు. అందులో భాగంగానే సాక్షాత్తూ సాయినాథుని క్షేత్ర‌మైన షిరిడీకి పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు వెళ్లి ఆయన్ను ద‌ర్శించుకుంటూ ఉంటారు. ప్ర‌ధానంగా గురువారం పూట ఆయ‌న్ను ద‌ర్శిస్తే ఇంకా చాలా మంచిద‌ని, అనుకున్న‌వి వెంట‌నే నెర‌వేరుతాయ‌ని భ‌క్తులు విశ్వసిస్తారు. దీంతోపాటు గురువారం నాడు కింద చెప్పిన విధంగా కొన్ని సూచ‌న‌లు పాటిస్తే దాంతో సాయిబాబా అనుగ్ర‌హం వెంట‌నే పొంద‌వ‌చ్చ‌ట‌. ఆ సూచ‌న‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

offerings-to-saibaba-1

పాల‌కూర‌…
సాయిబాబాకు పాల‌కూర అంటే చాలా ఇష్ట‌మ‌ట‌. ఈ క్ర‌మంలోనే గురువారం నాడు దాన్ని సాయిబాబాకు నైవేద్యంగా పెడితే అనుకున్న‌వి వెంట‌నే జ‌రుగుతాయ‌ట‌. భ‌క్తుల స‌మ‌స్య‌లు తీరుతాయ‌ట‌.

హ‌ల్వా…
సాయిబాబాకు ప్రియ‌మైన వంట‌కాల్లో హ‌ల్వా కూడా ఒక‌టి. కొంద‌రు భ‌క్తులు బాబాకు హ‌ల్వాను నైవేద్యంగా పెడతారు. అయితే దీన్ని గురువారం నాడు స‌మ‌ర్పిస్తే ఇంకా మంచి ఫ‌లితం ఉంటుంద‌ట‌.

కిచ్‌డీ…
కిచ్‌డీ కూడా సాయిబాబాకు ఇష్ట‌మైన వంట‌క‌మే. భ‌క్తులు ప్రేమ‌తో కిచ్‌డీని పెడితే బాబా క‌చ్చితంగా స్వీక‌రిస్తార‌ట‌. దీంతో వారు అనుకున్న‌వి నెర‌వేరుతాయ‌ట‌.

offerings-to-saibaba-2

కొబ్బ‌రి కాయ‌…
చాలా మంది దేవుళ్ల లాగే బాబాకు కూడా కొబ్బరి కాయ అన్నా ఇష్ట‌మే. భ‌క్తితో టెంకాయ కొడితే సాయి అనుగ్ర‌హం తప్ప‌క ల‌భిస్తుంది. గురువారం నాడు దీన్ని స‌మ‌ర్పిస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.

మిఠాయిలు…
సాయిబాబాకు అనేక మంది భ‌క్తులు వివిధ ర‌కాల మిఠాయిల‌ను కూడా స‌మర్పిస్తారు. అయితే ఏ మిఠాయి నైవేద్యంగా పెట్టినా గురువారం నాడు దాన్ని పెడితే అందుకు త‌గ్గ ఫ‌లితం ఉంటుంద‌ట‌.

పూలు, పండ్లు…
సువాస‌న‌ల‌ను వెద‌జ‌ల్లే పూలు, తియ్య‌ని పండ్లు అన్నా బాబాకు ఇష్ట‌మే. వాటిని స‌మ‌ర్పించినా భ‌క్తుల కోరిక‌లు నెర‌వేరుతాయి.

Comments

comments

Share this post

scroll to top