క‌ర్ర ప‌ట్టుకొని మ‌రీ విద్యార్థుల‌తో త‌న స్కూటీ క‌డిగించిన టీచ‌ర్.! ( Video)

”సిట్‌.. స్టాండ్‌.. సిట్‌.. స్టాండ్‌..!” ఏంటిదీ అనుకుంటున్నారా..? ఏమీ లేదండీ. స్కూళ్లలో విద్యార్థుల‌ను టీచ‌ర్లు ఇలాగే చేస్తారు క‌దా. సిట్ అంటే కూర్చుంటారు, స్టాండ్ అంటే నిలుచుంటారు. చ‌ద‌వ‌మని చెబితే చ‌దువుతారు. ఆట‌లాడ‌మంటే ఆడుతారు. విద్యార్థుల‌న్నాక టీచ‌ర్లు చెప్పిన ప‌ని చేయాలి క‌దా. ఇలా అనుకుందో ఏమో ఆ టీచ‌ర్ ఏకంగా విద్యార్థుల‌కు త‌న సొంత ప‌ని చెప్పింది. దీంతో ఆ విద్యార్థుల‌కు ఆ ప‌నిచేయ‌క త‌ప్పింది కాదు. అలా వారు టీచ‌ర్ సొంత ప‌నిచేస్తూ ఉండ‌గా ఓ వ్య‌క్తి ఆ వీడియోను తీశాడు. వెంట‌నే సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. ఇంకేముందీ క‌ట్ చేస్తే ఆ టీచ‌ర్ స‌స్పెండ్ అయింది. ఇంత‌కీ అస‌లు విష‌య‌మేమిటంటే…

అది ఒడిశా రాష్ట్రం అంగుల్ జిల్లా బాన‌ర్‌పాల్ బ్లాక్ లోని అమంత్‌పుర్ ప్రాజెక్ట్ అప్ప‌ర్ ప్రైమ‌రీ స్కూల్‌. అందులో సంయుక్త మాఝీ అనే ఉపాధ్యాయురాలు ప‌నిచేస్తోంది. అయితే ఆమెకు ఓ స్కూటీ ఉంది. దాన్ని శుభ్రం చేయ‌మ‌ని ఆ పాఠ‌శాల విద్యార్థుల‌కు చెప్పింది. దీంతో ఓ ముగ్గురు విద్యార్థులు స్కూటీని క‌డ‌గ‌సాగారు. అప్పుడే అటుగా వ‌చ్చిన ఓ టీవీ జ‌ర్న‌లిస్టు ఆ దృశ్యాల‌ను త‌న సెల్‌ఫోన్‌లో బంధించాడు. ఇక ఊరుకుంటాడా..? వెంట‌నే సోష‌ల్ మీడియాలో ఆ వీడియోను షేర్ చేశాడు.

దీంతో ఇప్పుడా వీడియో వైర‌ల్ అయింది. అది అలా అలా పాకి ఆ జిల్లా విద్యాధికారి వ‌ద్ద‌కు చేరింది. దీంతో ఆ అధికారి స‌ద‌రు టీచ‌ర్ సంయుక్త‌ను స‌స్పెండ్ చేశారు. అయితే వీడియో తీస్తున్న‌ప్పుడు ఆ జ‌ర్న‌లిస్టు ఆ టీచ‌ర్‌ను అడిగాడ‌ట‌. మీరు విద్యార్థుల‌తో స్కూటీ క‌డిగిస్తున్నారు, ఇక వారికి పాఠాలు ఎప్పుడు చెబుతార‌ని అన్నాడ‌ట‌. దీనికి ఆమె స్పందిస్తూ.. ముందు ఈ ప‌ని కానివ్వండి, త‌రువాత వారికి పాఠాలు చెబుతా అన్న‌ద‌ట‌. అవును మ‌రి, ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దివే విద్యార్థులంటే అంద‌రికీ చుల‌క‌నే. ఇక వాటిల్లో ప‌నిచేసే టీచ‌ర్ల‌కైతే మరీనూ. ఇక ఇలాంటి వారు పాఠాలు ఏం చెబుతారు చెప్పండి..? ఈ వ్య‌వ‌స్థ మారితేనే క‌దా, ప్ర‌భుత్వ స్కూళ్ల‌పై ఉన్న అప‌వాదు పోయేది. అది ఎప్పుడు జ‌రుగుతుందో.. వేచి చూడాలి..!

Comments

comments

Share this post

scroll to top