నెంబర్ ప్లేట్ల ఆధారంగా రొడ్డెక్కనున్న వాహనాలు..! సరిసంఖ్య ఉంటే ఒకరోజు, భేసి ఉంటే మరుసటి రోజు!?

అధికంగా పెరిగిపోతున్న చమురు వినియోగాన్ని,అంతే మొత్తంగా వెలువడుతున్న కాలుష్యాన్ని తగ్గించడం కోసం ఢిల్లీ సర్కార్ కొత్త ప్లాన్ ను రెడీ చేసుకుంది. ఈ కొత్త ప్లాన్ జనవరి 1, 2016 నుండి అమలు కూడా అవుతుందంట. దీని ప్రకారం.. నెంబర్ ప్లేట్ల ఆధారంగా ప్రైవేట్ వాహనాలు రోడ్డెక్కనున్నాయి. మీ వాహనం  నెంబర్ చివర (2,4,6,8,0) లాంటి సరిసంఖ్యలుంటే మీ వాహనం ఈ రోజు రోడ్డుమీద నడపొచ్చు..ఈ రోజు మరే ఇతర  భేసి సంఖ్య వాహనం రొడ్డెక్కడానికి వీలులేదు..అలాగే మరుసటి రోజు కేవలం బేసీ సంఖ్య వాహనాలే రొడ్డెక్కాలి, ఆ రోజు సరిసంఖ్య వాహానాలు రొడ్డెక్కే ఛాన్స్ ఉండదు….ఇలాంటి కొత్త చట్టం చేయడానికి రెడీ అవుతుంది ఢిల్లీ ప్రభుత్వం.

odd-even-numbered-vehicles-to-run-on-alternate-days-in-delhi-from-january-11-1449232427

ఇక ఈవెన్ డే, ఆడ్ డే  అంటూ అల్టర్ నెట్ డేస్ ప్రకారం బండ్లు రోడ్ల మీద పరుగులు తీస్తాయన్నమాట.. ఈ నిబంధన కేవలం ప్రైవేట్ వాహనాలకే పరిమితం.  అయితే, కొంతమంది దీనిని స్వాగతిస్తున్నా మరికొంతమంది వ్యతిరేఖిస్తున్నారు. అంత డబ్బు పెట్టి కొనుకున్న వాహనాన్ని రోడ్ల మీద తిరగకుండా అడ్డుకోవడం కరెక్ట్ కాదంటున్నారు, మరికొంతమందైతే….. ఇక ఇప్పటి నుండి రెండు వాహనాలను కొని…ఒక దానికి  సరిసంఖ్య , ఇంకో దానికి బేసీసంఖ్య ఉన్న నెంబర్ తీసుకుంటే సరి అంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు.

odd-even-numbered-vehicles-to-run-on-alternate-days-in-delhi-from-january-12-1449232460

కాలుష్యం విషయంలో ఢిల్లీ ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది. దానికి కంట్రోల్ చేయాలంటే ఇలాంటి నిర్ణయాలు తప్పవు మరీ కేజ్రీవాల్ సర్కార్ కు… చూద్దాం ప్లాన్ వర్కవుట్ అవుద్దో లేదో… అక్కడ ఓకే అయితే నెక్ట్స్ హైద్రాబాద్ లోనే అమలు చేయాల్సొస్తదేమో.!

Comments

comments

Share this post

scroll to top