ఓ ప్రియుడు…ఇద్దరు ప్రియురాళ్లు, పట్టించిన సీసీటీవీ!! ఎలా దొరికారో చూడండి! చివరికి గర్భిణిని!

గత నెల వెలుగులోకి వచ్చిన గర్భిణి హత్య కేసు గుర్తుందా..అత్యంత పాశవికంగా  చంపడమే కాదు ఆమె శవాన్ని పార్టులు పార్టులుగా అంటే కాళ్లూ, చేతులూ, తల, శరీరం వేరు వేరు చేసేంత దారుణంగా.. కొండాపూర్‌లోని బొటానికల్‌ గార్డెన్‌ వద్ద పడేసిన ఘటన.. హైదరాబాద్ మహానగరంలో ఇంతకుముందెన్నడూ కనివిని ఎరుగని అత్యంత భయంకరమైన మర్డర్..దీని వెనుక గల కారణాలను పోలిసులు చేధించారు.అక్రమ సంభదమే కారణమని తేల్చారు.వివరాలు..

నలుగురు వ్యక్తులు కలిసి ఈ హత్య చేసినట్లు గుర్తించారు. సీసీటీవీలు, సాంకేతికతే వారిని పట్టించింది. హత్య గురైన గర్భిణి పేరు బింగి అలియాస్‌ పింకి. బీహార్‌ రాష్ట్రంలోని బంకా జిల్లా మొహానా మల్తీ గ్రామం. ఆమెకు పెళ్లయింది. ముగ్గురు పిల్లలు. అదే సమయంలో, వికాస్‌ కశ్యప్ తో వివాహేతర సంబంధం కొనసాగించింది. భర్త వద్ద ఇద్దరు పిల్లలను వదిలేసి, రెండో కొడుకును తీసుకొని వికాస్ తో కలిసి స్వగ్రామం వెళ్లిపోయింది. అక్కడ  పింకితో మాత్రమే కాకుండా మరో మహిళతో అక్రమసంభందం ఏర్పరుచుకున్నాడు వికాస్.ఆమె పేరు మమత.

ఊళ్లోనే ఉంటే తమ సంబంధం కొనసాగదని భావించింది మమత. ఎందుకంటే ఓ వైపున భర్త అనిల్, ఆయన తరపు బంధువులున్నారు. గ్రామస్తులంతా చూస్తే భాగోదని మాస్టార్ ప్లాన్ వేసింది… హైదరాబాద్‌లో ఓ పబ్‌లో పని చేస్తున్న తన కొడుకు అమర్‌కాంత్‌ ఝా వద్దకు వికాస్ ను పథకం ప్రకారం పంపింది. డబ్బు సంపాదించుకుని వస్తానని బింగీకి చెప్పి వికాస్‌ గత ఏడాది జూలైలో హైదరాబాద్‌ వచ్చాడు. అప్పటికే బింగి వికాస్ కారణంగా గర్భవతి అయింది. తన కోసం డబ్బు సంపాదించుకుని వస్తాడని ఆశగా ఎదురుచూస్తూ కూర్చుంది. ఇంతలో కడుపులో శిశువు పెరుగుతోంది. అక్కడ సీన్ అంతటితో కట్ చేస్తే…

అమర్‌కాంత్‌ (మమత కొడుకు) గదికే వికాస్‌ చేరాడు. ముందస్తు ప్లాన్‌ ప్రకారం కొద్ది రోజులకు తన భర్త అనిల్‌ ఝాతో కలిసి మమత కూడా హైదరాబాద్‌ వచ్చింది. అంతా కలిసి సిద్దిఖీనగర్‌లోని ఓ అపార్టుమెంట్‌కు మారారు. మమతతో కలిసి వికాస్‌ గప్‌చు్‌పల వ్యాపారం ప్రారంభించాడు. అనిల్‌ అంత తెలివిలేనివాడు కావడంతో వాళ్లతోనే పని చేసేవాడు. దాంతో, వారి అక్రమ సంబంధానికి ఎలాంటి అడ్డూ లేకుండా సాగిపోతోంది. కాని బీహార్ లో ఉంటున్న బింగికి వికాస్ పై బెంగపట్టుకుంది. హైదరాబాద్‌ వెళ్లిన దగ్గర నుంచీ ప్రియుడు వికాస్‌ నుంచి ఫోన్‌ కానీ సమాచారం కానీ లేకపోవడంతో దిగులు చెందింది. రెండు నెలల కిందట కొడుకును తీసుకుని సరాసరి హైదరాబాద్‌ వచ్చింది. మమత ఝా ఉంటున్న ఇంటికే వెళ్లింది. ఈ క్రమంలోనే వికాస్‌, మమత అక్రమ బంధం గురించి బింగీకి తెలిసింది. దీనికితోడు సంపాదించిన డబ్బులను కూడా మమతకే ఇస్తున్నాడని వికాస్ ను నిలదీసింది. దాంతో ఆమెను అడ్డు తొలగించుకోవాలని వికాస్‌, మమత పథకం వేశారు. అనిల్‌, అమర్‌కాంత్‌లకు ఆమె గురించి చెడుగా నూరిపోశారు.

అమర్‌కాంత్‌, అనిల్‌లతో కలిసి ఆమెను హత్య చేశారు.అంతా కలిసి బింగీ తలను మొండెం నుంచి వేరు చేశారు. చేతులు, కాళ్లు, తొడలను వేర్వేరుగా కట్‌ చేశారు. మొండాన్ని గోనె సంచిలో, మిగిలిన వాటిని డస్ట్‌బిన్‌ కవర్‌లో పార్శిల్‌ చేశారు. ఒక రోజంతా శవం మూటలను ఇంట్లోనే ఉంచారు. వికా్‌సకు బైక్‌ నడపడం రాకపోవడంతో అమర్‌కాంత్‌ తన తల్లితో కలిసి జనవరి 29 తెల్లవారుజామున 3:30 గంటలకు ఆ మూటలను తీసుకొని బయలుదేరారు. ఇద్దరూ హెల్మెట్లు, మాస్క్‌లు ధరించి బొటానికల్‌ గార్డెన్‌ వద్ద వాటిని పడేసి వెళ్లిపోయారు. మాదాపూర్ పోలీసులు 150 సీసీటీవీ పుటేజీలను పరిశీలించి, ఎంతో నిశితంగా శోధించి ఈ కేసు గుట్టును బయటకు లాగారు. అమర్‌కాంత్‌ ఇంటికి వెళ్లి మమత, అనిల్‌లను అదుపులోకి తీసుకున్నారు. అమర్‌కాంత్‌ బీహార్‌ పారిపోవడంతో రెండు బృందాలను అక్కడికి పంపి అరెస్టు చేశారు. బింగీ ప్రియుడు వికాస్‌ మాత్రం పరారీలో ఉన్నాడు.

Comments

comments

Share this post

scroll to top