మీరు “నువ్వు నాకు నచ్చావ్” సినిమా చూసారా..? అయితే ఈ 10 ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరేమో ట్రై చేయండి..!

హీరోయిన్ ఎంగేజ్మెంట్ సీన్ తో సినిమా స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ తండ్రి ఫ్రెండ్ కొడుకైన మన హీరో కూడా హీరోయిన్ ఇంటికి వస్తాడు. అక్కడ అవుట్ హౌస్ లో ఉంటూ కామెడీ చేస్తూ ఉంటాడు. ఇంతలో ఉద్యోగం వస్తుంది. ఇలా సాగుతుండగా అనుకోకుండా హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. కానీ తండ్రికి ఇచ్చిన మాటకోసం ఆ అమ్మాయిని ప్రేమించాలా? వద్దా? అనే కన్ఫ్యూషన్ లో పడతాడు మన హీరో. ఈపాటికే మీకు అర్ధం అయిపోయి ఉంటుంది ఇంతసేపు మాట్లాడింది “వెంకటేష్, ఆర్తి అగర్వాల్” జంటగా నటించిన “నువ్వు నాకు నచ్చావ్” సినిమా గురించని. ఎన్ని సార్లు చుసిన ఈ సినిమా బోర్ కొట్టాడు అనడంలో అతిశయోక్తి ఏం లేదు అని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఆ సినిమా ఈపాటికే ఎన్నో సార్లు చూసుంటారు. డైలాగులన్నీ నిద్రలో లేపి అడిగిన చెప్పేయగలరనుకుంటా. అయితే ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ట్రై చేయండి!

#1. ఈ సినిమాలో “వెంకీ” (వెంకటేష్) సొంత ఊరు ఏది.?
a) రాజమండ్రి
b) కాకినాడ
c) అనకాపల్లి
d) విశాఖపట్నం

#2. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు?
a) త్రివిక్రమ్
b) విజయ్ భాస్కర్
c) వి.వి. వినాయక్
d) కృష్ణవంశీ

#3. ఈ సినిమాలో పని వాడి పాత్రలో నటించిన “సునీల్” పాత్ర పేరేంటి?
a) చంటి
b) బంతి
c) కత్తి
d) సత్తి

#4. ఈ సినిమాలో “పింకీ” పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన నటి పేరేంటి?
a) సుదీప
b) సుధీర్మ
c) సువర్ణ
d) సురేఖ

#5. ఈ సినిమాకి సంగీతం అందించింది ఎవరు?
a) కీరవాణి
b) దేవిశ్రీ ప్రసాద్
c) కోటి
d) ఆర్.పి. పట్నాయక్

#6. ఈ సినిమాలో అన్ని పాటలు రాసింది ఒకరే. ఆ గేయ రచయిత ఎవరు?
a) సిరివెన్నెల సీతారామ శాస్త్రి
b) చంద్రబోస్
c) వేటూరి సుందరరామ మూర్తి
d) సుద్దాల అశోక్ తేజ

#7. ఈ సినిమాలో “ఆర్తి అగర్వాల్” అత్తగా నటించిన సీనియర్ నటి ఎవరు?
a) సుహాసిని
b) జయసుధ
c) జయప్రద
d) రమ్యకృష్ణ

#8. పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగితే “వెంకీ” ఏమన్నాడు?
a) డాక్టర్
b) బ్యాంకు మేనేజర్
c) సైకిల్ మెకానిక్
d) స్కూల్ టీచర్

#9. ఆర్తి అగర్వాల్ ఇంటికి “బాబాయ్, మామయ్య” అని వచ్చిన గెస్ట్స్ ఎవరు.?
a) ఏ.వి.ఎస్, ఎల్.బి శ్రీరామ్
b) మల్లికార్జున్, బాబు మోహన్
c) మల్లి కార్జున్, బ్రహ్మానందం
d)బాబు మోహన్, ఏ.వి.ఎస్

#10. “వెంకీ నువ్వు పట్టుకుంది నా కాళ్ళు కాదు…” అని పింకీ చెప్పే డైలాగ్ కంటిన్యూ చేయండి?
a) సోఫా కోళ్లు
b) మంచం కోళ్లు
c) కుర్చీ కోళ్లు
d) టేబుల్ కోళ్లు

>>>CLICK HERE FOR ANSWERS (జవాబుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)<<<

Comments

comments

Share this post

scroll to top