కొన్ని గంట‌ల్లో చ‌నిపోతాన‌ని తెలిసిన న‌ర్స్…త‌న భ‌ర్త‌కు రాసిన లెట‌ర్.

రోగుల‌కు చికిత్స చేస్తుండ‌గా…నిఫా వైర‌స్ నాకూ సోకింది. నాకు తెలుసు ఈ వైర‌స్ కు మందు లేద‌ని.! నేను కొన్ని గంట‌ల్లో చ‌నిపోతాన‌ని నాకు తెలుసు, చివ‌రి సారిగా మిమ్మ‌ల్ని, పిల్ల‌ల్ని కూడా చూడ‌లేన‌ని కూడా నాకు తెలుసు ఇదే నా గుండెల్ని మ‌రింతగా పిండేస్తుంది. పిల్ల‌ల్ని జాగ్ర‌త్తగా చూసుకో…వారిని గ‌ల్ఫ్ తీసుకెళ్ళు, వారిని బాగా పెంచు, నేను లేన‌ని నీవు జీవితాంతం ఒంట‌రిగా ఉండ‌కు, మా నాన్న‌లా నీ జీవితాన్ని ఒంట‌రి చేసుకోకు…. జాగ్ర‌త్త‌గా ఉండూ..దేవుడు నాకే ఇలా ఎందుకు చేశాడో అర్థ‌మ‌వ్వ‌ట్లేదు.! బై.! నా కాలం చెల్లింది.! పిల్ల‌లు జాగ్ర‌త్త‌.!! ఇది మ‌రికొద్దిసేప‌ట్లో చ‌నిపోతాన‌ని తెలిసిన ఓ న‌ర్స్ త‌న భ‌ర్త‌కు రాసిన లెట‌ర్.!

 

ప్రాణాంత‌క నిఫా వైర‌స్ సోకిన రోగుల‌కు చికిత్స అందిస్తున్న కేర‌ళ‌కు చెందిన లినీ అనే న‌ర్స్ కు కూడా ఈ వైర‌స్ సోకింది, ఈ వైర‌స్ సోకిన లినీ ఆ హాస్పిట‌ల్ లోనే చ‌నిపోయింది. కుటుంబ స‌భ్యులు చివ‌రి చూపు చూడ‌క‌ముందే లినీ డెడ్ బాడీని నిమిషాల వ్య‌వ‌ధిలోనే ఖ‌న‌నం చేశారు. చివ‌రి చూపుకు అవ‌కాశ‌మిస్తే…మిగితా వారికి కూడా ఈ వైర‌స్ సోకే ప్ర‌మాద‌ముంద‌ని తెలిసి డాక్ట‌ర్లు ఇలా చేశారు.

కేర‌ళ‌లో నిఫా వైర‌స్ క‌ల‌క‌లాన్ని సృష్టిస్తుంది ఇప్ప‌టికే 10 మంది ఈ వైర‌స్ కార‌ణంగా మృత్యువాత ప‌డ్డారు. ఇది అరుదైన వైరస్‌. గబ్బిలాలు, పందులు, ఇతర జంతువులతో ఈ వైరస్‌ వ్యాపిస్తుంది. దీనికి ఇంతవరకు వ్యాక్సిన్‌ కూడా లేనట్లు తెలుస్తోంది. తీవ్రమైన జ్వరం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, రక్తపోటు పడిపోవడం, బలహీనత ఈ వ్యాధి లక్షణాలు.

Comments

comments

Share this post

scroll to top