డాక్టర్లే కాదు, వారిలా సేవ చేసే నర్సులు అన్నా సమాజంలో గౌరవ ప్రదమైన వృత్తిగానే చూస్తారు. ఎందుకంటే వారు మనుషుల ప్రాణాలను రక్షిస్తారు కదా. నిత్యం వారు రోగుల బాగోగులను చూస్తారు. ఏదైనా అస్వస్థత కలిగిందంటే వెంటనే డాక్టర్‌కు చెబుతారు. ఆపరేషన్ అయిన పేషెంట్లను కూడా జాగ్రత్తగా చూసుకుంటారు. అయితే నర్సు గా పనిచేసిన ఆ వ్యక్తి మాత్రం అలా కాదు. అతనికి పేషెంట్ల ప్రాణాలను తీయడం అంటే సరదా. అందులో భాగంగానే అతను తన చేతుల్తో డ్రగ్స్ ఓవర్ డోస్ ఇచ్చి ఏకంగా 100 మంది పేషెంట్లను పొట్టన పెట్టుకున్నాడు.
అతని పేరు Niels Högel. జర్మనీ వాసి. అతను రెండు హాస్పిటల్స్‌లో నర్సుగా పనిచేశాడు. అయితే నీల్స్కి డిప్రెషన్ ఎక్కువ. మానసికంగా సరిగ్గా ఆలోచించేవాడు కాదు. దీనికి తోడు సైకో లక్షణాలు కూడా ఎక్కువగా ఉండేవి. దీంతో తాను నర్సుగా పనిచేసిన మొదటి హాస్పిటల్లో 38 మందిని చంపగా, రెండో హాస్పిటల్లో 62 మందిని చంపాడు. వారికి డ్రగ్స్‌ను ఓవర్ డోస్‌లో ఎక్కించేవాడు. దీంతో పేషెంట్లు చనిపోయేవారు. అలా నీల్స్ మొత్తం 100 మంది ప్రాణాలు తీశాడు.
అయితే ఇలాంటి దారుణం ఎప్పటికైనా బయట పడాల్సిందే. ఈ క్రమంలోనే తాజాగా నీల్స్ చేసిన ఘోరాన్ని హాస్పిటల్ వైద్యులు గుర్తించారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు నీల్స్‌ను అరెస్ట్ చేశారు. త్వరలో అతనికి శిక్ష వేయనున్నారు. అయితే పోలీసుల విచారణలో నీల్స్ ఏమన్నాడో తెలుసా..? అతనికి బోర్ కొట్టి ఆ పనిచేశాడట. నిజంగా ఇది షాకింగ్ విషయమే..! ఏది ఏమైనా ఇలాంటి రాక్షసులు అసలు నర్సు వృత్తిలోనే కాదు, సమాజంలోనూ ఉండకూడదు. ఇక మరి అంత మందిని నిర్దాక్షిణ్యంగా చంపినందుకు గాను నీల్స్కు ఏ శిక్ష పడుతుందో మరి..!