పుట్టిన తేదీ ప్ర‌కారం 2017 మీకు ఏవిధంగా ఉండ‌బోతుందో తెలుసా..?

అప్పుడే 2016 అయిపోవ‌చ్చింది. మొన్నా మ‌ధ్యే న్యూ ఇయ‌ర్ వేడుక‌లు జ‌రుపుకున్న‌ట్టుగా ఉంది. ఇంత‌లోపే మ‌ళ్లీ న్యూ ఇయ‌ర్ రానే వ‌చ్చింది. అంతే క‌దా మ‌రి… కాలం ఎవ‌రి కోసం ఆగ‌దు. స్పీడ్‌గా ప‌రిగెత్తుతూనే ఉంటుంది. అయితే కొత్త సంవ‌త్స‌రం వ‌స్తుంద‌న‌గానే చాలా మంది ఆ ఏడాదిలో త‌మ‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని ఆశిస్తారు. ఏ రంగానికి చెందిన వ్య‌క్తులైనా రాబోయే నూత‌న ఏడాదిలో తాము అనుకుంది అనుకున్న‌ట్టు జ‌రగాల‌ని కోరుకుంటారు. కానీ… అంద‌రూ ఆశించినట్టు జ‌రగ‌దు క‌దా. అయితే ఈ 2017 లో ఎవ‌రెవ‌రికి ఏ విధంగా ఉంటుందో, ఎలా క‌ల‌సివ‌స్తుందో, క‌ల‌సి రాదో, ఏ రంగంలో రాణిస్తారో… వారి వారి జ‌న్మ తేదీని బ‌ట్టి మ‌నం తెలుసుకోవ‌చ్చు.  పుట్టిన రోజు తేదీ ప్ర‌కారం 2017 సంవత్సరానికి గాను ఆయా వ్య‌క్తుల‌కు ఏవిధంగా ఉంటుందో న్యూమ‌రాల‌జీ మ‌న‌కు తెలియ‌జేస్తోంది. దానిపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం..!

2017-numerology
నంబ‌ర్ 1 వ‌చ్చే వారికి…
నంబ‌ర్ 1 వ‌చ్చే వారికి అంటే… 1, 10, 19, 28 తేదీల్లో జ‌న్మించిన వారికి న్యూమ‌రాల‌జీ ప్ర‌కారం ఈ ఏడాది కొంతలో కొంత క‌ల‌సి వ‌స్తుంద‌నే చెప్ప‌వ‌చ్చు. వీరు ఈ ఏడాది నాయ‌కులుగా ఎదిగేందుకు అవ‌కాశం ఉంటుంది. చిన్న‌నాటి స్నేహితులు ద‌గ్గ‌ర‌వుతారు. అదే అమ్మాయిలైతే ప్రేమ‌లో ప‌డేందుకు అవ‌కాశం ఉంటుంది. వీరికి కాంప్ర‌మైజింగ్ అంటే న‌చ్చ‌దు. కానీ జీవిత భాగ‌స్వామి విష‌యంలో మాత్రం ఆ నిర్ణ‌యాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది.

నంబ‌ర్ 2 కు…
2, 11, 20, 29 తేదీల్లో పుట్టిన వారు 2017లో మాన‌సికంగా కొంత డిస్ట‌ర్బెన్స్ అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంది. వీరి మూడ్ ఎల్ల‌ప్పుడూ ఒకేలా ఉండ‌దు. మారుతూ ఉంటుంది. వీరు చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. ఎమోష‌న‌ల్‌గా ఎక్కువ‌గా ఫీల‌య్యేందుకు అవ‌కాశం ఉంటుంది.

నంబ‌ర్ 3 కు…
3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారు ఈ ఏడాది ల‌క్ష్య సాధన దిశ‌గా ప్ర‌యాణం చేస్తారు. అందుకు గాను ఎలాంటి అడ్డంకినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. వీరు ఏమాత్రం భ‌య‌ప‌డ‌రు. మ‌న‌స్సులో ఏదైతే ఉందో దాన్ని నిర్భ‌యంగా బ‌య‌టికి చెప్పేస్తారు. మ‌న‌స్సు చెప్పిన‌ట్టు ఫాలో అయిపోతారు. అయితే వీరు త‌మ‌ను ప్రేమించే వారి ప‌ట్ల కొంచెం జాగ్ర‌త్త‌గా ఉంటే మంచిది.

నంబ‌ర్ 4కు…
4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన వారు ఈ ఏడాది చాలా ఉత్సాహంగా ఉంటారు. స‌ర‌స ప్రియులు కావ‌డంతో ఎవ‌రితోనైనా ఇట్టే ముందుకు సాగిపోతారు. జీవిత భాగ‌స్వామి అంటే వీరికి చాలా ఇష్టం. అందుకు వారితో విశ్వాసంగా కూడా ఉంటారు. అయితే వీరు క‌చ్చితమైన ల‌క్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగ‌డం వ‌ల్ల‌, త‌మ‌ను తామే విశ్లేషించుకోవ‌డం వ‌ల్ల ఉన్న‌త స్థానాల‌కు ఎదిగేందుకు అవ‌కాశం ఉంటుంది.

నంబ‌ర్ 5కు…
5, 14, 23 తేదీల్లో పుట్టిన వారు 2017లో అన్ని విష‌యాల్లోనూ ఆచి తూచి అడుగేస్తారు. ఏది మంచిదో, ఎందులో మంచి జ‌రుగుతుందో చూసి తెలుసుకుని వాటిలో అడుగుపెడ‌తారు. వీరు చాలా జాలీగా, ఓపెన్ టైప్‌గా ఉంటారు. జీవిత భాగ‌స్వామి ప‌ట్ల ఎంతో న‌మ్మ‌కం వీరికి ఉంటుంది.

నంబ‌ర్ 6 కు…
6, 15, 24 తేదీల్లో పుట్టిన వారికి ఈ ఏడాది ప్రేమ విష‌యంలో మంచి ఫ‌లితాలు వ‌స్తాయి. ప్రేమ కోసం వీరు చావ‌డానికైనా సిద్ధ‌ప‌డ‌తారు. వీరంటే అంద‌రికీ ఇష్ట‌మే ఉంటుంది. జీవిత భాగ‌స్వామినైతే వీరు అత్యంత ప్రేమ‌గా చూసుకుంటారు.

నంబ‌ర్ 7కు…
7, 16, 25 తేదీల్లో పుట్టిన వారికి 2017లో అంత‌గా ఏం క‌ల‌సి రాదు. అయినా వీరు నిరాశ చెంద‌రు. క్రియేటివ్‌గా ఆలోచించే శ‌క్తిని క‌లిగి ఉండ‌డం వ‌ల్ల ముందుకు వెళ్తారు. ప‌ర్‌ఫెక్ట్ లైఫ్ పార్ట్‌న‌ర్ కావాల‌ని కోరుకుంటారు. అయితే అది అంత తేలిగ్గా సాధ్యం కాదు. ఏదో ఒక లోపం అడ్డు వ‌స్తుంది.

నంబ‌ర్ 8కు…
8, 17, 26 తేదీల్లో పుట్టిన వారు 2017లో త‌మ మాట‌ల విష‌యంలో కొంత జాగ్ర‌త్త వ‌హించాలి. లేదంటే అనుకోని ఉప‌ద్ర‌వాలు తెచ్చి పెడ‌తాయి. వీరు చాలా న‌మ్మ‌కంగా ఉంటారు. ప్రేమ‌తో ఉంటారు. అయితే అనుకోకుండా ప్రేమ, పెళ్లి బంధంలో ప‌డే అవ‌కాశం ఉంటుంది. వీరు తమ జీవిత భాగ‌స్వామి నుంచి చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అయితే అర్థం చేసుకునే వారిని పెళ్లాడితే లైఫ్ బాగుంటుంది.

నంబ‌ర్ 9కు…
9, 18, 27 తేదీల్లో పుట్టిన వారు 2017లో హ్యాపీగా ఉండాలంటే కొన్ని జాగ్ర‌త్త‌లు పాటించాలి. ముఖ్యంగా లైఫ్ పార్ట్‌న‌ర్ విష‌యంలో అస్స‌లు నిర్ల‌క్ష్యం ప‌నికి రాదు. వీరు త్వ‌ర‌గా హ‌ర్ట్ అయ్యే మ‌న‌స్త‌త్వం క‌లిగి ఉంటారు. త్వ‌ర‌గా ఎమోష‌న‌ల్ అవుతారు. చిన్న చిన్న విష‌యాల‌కు కూడా దిగులు చెందుతారు.

Comments

comments

Share this post

scroll to top