పురాణ కాలాల్లోనే అణుబాంబులు ఉన్నాయంట.? ఆధారాలివిగో..!

అత్యంత అధునాత‌న సాంకేతిక ప‌రిజ్ఞానంతో కూడిన మిస్సైల్స్‌… శ‌క్తివంత‌మైన అణు బాంబులు… ప‌వ‌ర్‌ఫుల్ తుపాకులు, మెషిన్‌గ‌న్‌లు, యుద్ధ ట్యాంక‌ర్లు… ఇవ‌న్నీ ఇప్పుడు ఆయా దేశాల‌కు చెందిన ఆర్మీ వాడుతున్న ఆయుధాలు. అయితే ఒక‌ప్పుడు, అంటే కృత‌యుగం, త్రేతాయుగం, ద్వాప‌ర యుగంల‌లో ఉన్న ఆయుధాలు వేరే. బాణాలు, బ‌రిశెలు, క‌త్తులు… వంటివి ఉండేవి. ఇవి కాక గుర్రాలు, ర‌థాలు, ఏనుగులపై వ‌చ్చి సైనికులు యుద్ధం చేసేవారు. అయితే… ఆయా యుగాల్లో జ‌రిగిన రామ‌, రావ‌ణ యుద్ధం, మ‌హాభార‌త యుద్ధం వంటి పురాణేతిహాసాల‌కు చెందిన యుద్ధాల్లోనూ అణుబాంబులు ఉండేవ‌ట‌. ఆ కాలంలోనే వాటిని ప్ర‌యోగించిన‌ట్టు ప‌లు పురాణ గాథ‌ల ద్వారా మ‌న‌కు తెలుస్తుంది..!

nuclear-purana

”సూర్యుని శ‌క్తి ఎంత‌టిదో తెలుసు క‌దా… అంత‌కు 10వేల రెట్ల శ‌క్తి క‌లిగిన ఓ కాంతి ప్ర‌జ‌లంద‌రినీ బూడిద‌లా మార్చేసింది.”

”మ‌ట్టితో చేసిన ఓ పాత్ర‌లో రాగి, ఇనుము, య‌శ‌ద‌ము (జింక్‌) వంటి లోహాలకు చెందిన రేకుల‌ను నిర్దిష్ట‌మైన క్ర‌మంలో పెట్టి, అందులో మిత్ర‌, వ‌రుణ (క్యాథోడ్ – ఆనోడ్‌)ల‌ను అమ‌ర్చి, నీరు ప్ర‌స‌రింప‌జేస్తే ప్రాణ‌వాయువు (ఆక్సిజ‌న్‌), ఉదాన వాయువు (హైడ్రోజ‌న్) వెలువ‌డుతాయి.”

పై రెండు లైన్లు మేం ఊహ‌తో చెప్పింది కాదు… వీటి గురించి పురాణాల్లో ఉంది. వాటిని బేస్‌గా తీసుకుంటే గ‌న‌క పైన చెప్పిన లైన్‌కు ఇప్ప‌టి అణుబాంబు అనే అర్థం వ‌స్తుంది. అంతేకాకుండా కింది లైన్‌కు ఎల‌క్ట్రిక‌ల్ బ్యాట‌రీలు అనే అర్థం వ‌స్తుంది. అంటే పురాణ కాలంలోనూ అణు బాంబులు ఉన్నాయ‌డానికి ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని ప‌లువురు చ‌రిత్ర‌కారులు చెబుతున్నారు. ఇవే కాకుండా ఒక‌ప్పుడు రామాయ‌ణంలో రాముడు, ల‌క్ష్మ‌ణుడు, భార‌తంలో అర్జునుడు వంటి వారు వేసిన నారాయ‌ణ అస్త్రం, పాశుప‌తాస్త్రం, ప‌ర్జ‌న్య అస్త్రం, అగ్ని అస్త్రం, బ్ర‌హ్మాస్త్రం వంటివి కూడా ఈ యుగానికి చెందిన ప‌లు బాంబుల‌నే అర్థాలు వ‌స్తాయి. ప్ర‌ధానంగా బ్ర‌హ్మాస్త్రం, పాశుప‌తాస్త్రం వంటి అస్త్రాలు మిక్కిలి శ‌క్తివంత‌మైన‌వి కావ‌డం చేత అప్ప‌ట్లో వాటిని ఇప్ప‌టి అణుబాంబుల్లా ఉపయోగించార‌ట‌. ఎందుకంటే అవి విడుద‌ల చేసే శ‌క్తి అంత‌లా ఉంటుంద‌ట‌..! దీన్ని బ‌ట్టి చూస్తే పురాణ కాలంలోనూ అణుబాంబులు ఉన్నాయ‌నే చెప్ప‌వ‌చ్చ‌ని ప‌లువురు పండితులు కూడా విశ్లేషిస్తున్నారు.

Comments

comments

Share this post

scroll to top