Jr.NTR " జనతా గ్యారేజ్" ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన అభిమానులు.!?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ లాంటి సూపర్ హిట్ తర్వాత రచయిత, దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్ లో నటిస్తున్న మాస్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘జనతా గ్యారేజ్’. తాజాగా ఈ చిత్ర షూటింగ్ సారధి స్టూడియోస్ లో వేసిన ప్రత్యేక సెట్ లో మోహన్ లాల్, ఇతర తారాగణంపై జరుగుతోంది. కాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను ఊహించి, రూపొందించి  రిలీజ్ చేశారు యంగ్ టైగర్ వీరాభిమానులు. ఎన్టీఆర్ సినిమాలు టెంపర్, రభస చిత్రాల యాక్షన్ షాట్స్ ను, మోహన్ లాల్ మల్లువుడ్, తమిళ సినిమాలలోని సీన్స్ కలిపి చేసిన ఈ టీజర్ అడిరిపోయిందనే చెప్పొచ్చు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ భలే సెట్ చేశారు. తమ అభిమాన హీరో సినిమా మొదలవ్వగానే సినిమాపై అంచనాలు పెంచడానికి, తమ అభిమానాన్ని చాటుకోవడానికి ఇలాంటి టీజర్స్ ను ఫ్యాన్స్ రూపొందించడం కొత్తేం కాదులెండి.

ఎన్టీఆర్ సరసన సమంతా, నిత్యమీనన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో సాయికుమార్ ఎన్టీఆర్ తండ్రిగా నటిస్తున్నాడు. మోహన్ లాల్ సరసన దేవయాని జతకట్టింది. మల్లువుడ్ హీరో ఉన్ని ముకుందన్ విలన్ గా ఎంపికయ్యాడు. రాక్  స్టార్  దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.  వాస్తవానికి ఇది ప్యాన్ మేడ్ ఫస్ట్ లుక్ యే అయినప్పటికీ  ఒరిజినల్ దాంట్లో ఉండాల్సిన అన్ని హంగులు ఉండేలా జాగ్రత్త పడ్డారు దీనిని రూపొందించిన వాళ్ళు.

Watch Jr.NTR Janata Garrage First Look:

Comments

comments

Share this post

scroll to top