“బాహుబలి 2 ” సినిమా చుసిన “జూనియర్ ఎన్టీఆర్” ఏమన్నారో తెలుసా..? ఏమని కామెంట్ వేసారో చూడండి..!

సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న బాహుబలి2 దేశవ్యాప్తంగా ఇవాళ విడుదలైంది. బెన్‌ఫిట్ షో నుంచే పాజిటివ్ టాక్‌తో ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న ఈ చిత్రంపై పలువురు సినీ ప్రముఖులు ట్వీట్స్ చేశారు. వీరిలో ముఖ్యంగా రాజమౌళితో హ్యాట్రిక్ హిట్ కొట్టిన జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ ఎంతో ప్రత్యేకం. ఎస్ఎస్ రాజమౌళి తీసింది తెలుగు సినిమా మాత్రమే కాదని, భారతీయ సినిమా స్థాయిని విశ్వవ్యాప్తం చేసిన సినిమా అని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు.

>>>బాహుబలి -2 స్టోరీ, రివ్యూ & రేటింగ్..! (CLICK HERE)<<<

>>>బాహుబలి చూడడానికి బాస్ కు గమ్మత్తైన లీవ్ లెటర్ రాసిన ఉద్యోగి!<<<

రాజమౌళికి హ్యాట్సాఫ్ అంటూ కొనియాడాడు. రాజమౌళి విజన్‌కు తమ అద్భుత నటనతో మద్దతుగా నిలిచినందుకు ఖుదోస్ టూ ప్రభాస్, అనుష్క, రమ్యకృష్ణన్ అని ట్వీట్ చేశాడు. ఈ కలను నిజం చేసిన నిర్మాతలు శోభూ, ప్రసాద్, ఇతర నటులకు, టెక్నీషియన్లకు గొంతెత్తి జై కొట్టాలని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. హీరోల మధ్య సన్నిహిత సంబంధాలు ఎలా ఉంటాయో జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ మరోసారి నిరూపించింది. ఫ్యాన్స్ అనవసర ఘర్షణకు దిగకుండా ఉండాలని మరోసారి చాటి చెప్పినట్లయింది.

Comments

comments

Share this post

scroll to top