ఒక “బిగ్ బాస్” షో ఎపిసోడ్ కి “ఎన్టీఆర్” ఎంత తీసుకుంటున్నారో తెలుసా..? పెట్టిన కండిషన్స్ ఇవే..!

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ త్వరలో బుల్లితెర ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ మాటీవీ వారు ప్రారంభించబోతున్న ‘బిగ్ బాస్’ రియాల్టీ షోకు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. చిరంజీవి, నాగార్జున హోస్ట్ చేసిన “మీలో ఎవరు కోటీశ్వరుడు” ఇటీవలే ముగిసింది. ఇప్పుడు సరికొత్తగా ఎన్టీఆర్ఈ బుల్లితెర ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సంగతి ఇటీవలే స్టార్ మా ఆఫిసిఅల్ ఫేస్బుక్ లో పోస్ట్ చేసారు. ప్రెస్ నోట్ విడుదల చేసారు. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. కన్ను కొడుతూ చిలిపి లుక్‌లో దర్శనమిచ్చిన ఎన్టీఆర్.

బిగ్ బాస్ షో పై ఎన్టీఆర్ మాట్లాడుతూ…

“టెలివిజన్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మీడియమ్ ఫర్ ఎంటర్టెన్మెంట్. స్టార్ మా టీవీ వారు బిగ్ బాస్ లాంటి పెద్ద టీవీ షోను హోస్ట్ చేయాలని నన్ను సంప్రదించినపుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. దీన్నొక ఛాలెంజ్ గా చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ షో తెలుగు టెలివిజన్ రంగంలో గేమ్ చేంజర్ అవుతుందని నమ్ముతున్నాను. బిగ్ బాస్ అనేది ఇంటర్నేషనల్ షో బిగ్ బ్రదర్ ఫార్మాట్లో సాగే ఓ రియాల్టీ షో. ప్రపంచ టెలివిజన్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ షోగా పేరు తెచ్చుకుంది. హాలీవుడ్లో, బాలీవుడ్లో ఈ రియాలిటీ షోలు సూపర్ సక్సెస్ అయ్యాయి. తెలుగులో కూడా హిట్ అవుతుంది అనుకుంటున్నాను.”

బిగ్ బాస్ అనేది ఇంటర్నేషనల్ షో బిగ్ బ్రదర్ ఫార్మాట్లో సాగే ఓ రియాల్టీ షో. ప్రపంచ టెలివిజన్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ షోగా పేరు తెచ్చుకుంది. హాలీవుడ్లో, బాలీవుడ్లో ఈ రియాలిటీ షోలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్లోనూ దీన్ని ప్రారంభించాలని నిర్వహకులు భావించారు. జూ ఎన్టీఆర్ ను హోస్ట్ గా ఎంచుకున్నారు.

మరి ఎన్టీఆర్ బిగ్ బాస్ షో కి ఎంత తీసుకుంటున్నారు..?

ఇంత పెద్ద షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఎన్టీఆర్ భారీ పారితోషికాన్నే అందుకుంటున్నాడు. ఒక ఎపిసోడ్‌కి అక్షరాలా రూ. 50 లక్షలు ఎన్టీఆర్‌కి ముట్టజెబుతోందట స్టార్ మా. సౌతిండియాలో టెలివిజన్ షో కోసం ఓ హీరో ఈ రేంజులో పారితోషికం తీసుకోవడం ఇదే ప్రథమం. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ‘బిగ్ బాస్’ షో తెలుగులో ఎంత విజయం సాధిస్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!

ఎన్టీఆర్ పెట్టిన కండిషన్స్ ఇవే:

  • షోను హైదరాబాద్‌లో షూట్ చేయొద్దు …ముంబైలోనే షూటింగ్ జరగాలని షరతు విధించారట.
  • ఈ కార్యక్రమం కోసం టాప్ క్లాస్ టెక్నిషియన్లను ఎంపిక చేయాలని ఈ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కావొద్దని తారక్ సూచించాడని సమాచారం.
  • వీటితో పాటు మరికొన్ని కండీషన్ల లీస్ట్‌ను ముందుగానే వారికి అందించాడట. అన్నిటికి యాజమాన్యం ఒప్పుడుకుంది

Comments

comments

Share this post

scroll to top