అన్న గారిని మళ్ళీ మీ రూపంలో చూసుకున్నాం అయ్యా- ఫాన్స్, ఎన్టీఆర్ కథానాయకుడు రివ్యూరేటింగ్.?

అక్కినేని నాగేశ్వర్ రావు గారి నుండి మొదలు పెట్టి ఎందరో మహానుభావుల పాత్రలను కథానాయకుడు సినిమాలో చూపించారు, మహానుభావుల పాత్రలకు ప్రాణం పోశారు నేటి తరం నటీనటులు. ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ లో నటించిన బాలకృష్ణ గారి గురుంచి ఎంత చెప్పినా తక్కువే. బసవతారకం గారి పాత్రలో నటించిన విద్యా బాలన్ అందరి మెప్పు పొందుతారు. బాలకృష్ణ గారు ఇప్పటి వరకు నటించిన అన్ని సినిమాలు ఒక ఎత్తు, ఈ ఒక్క సినిమా ఒక ఎత్తు. మహానటి సినిమా మనల్ని ఆ కాలం లోకి ఎలాగైతే తీసుకెళ్ళిందో, ఎన్టీఆర్ సినిమా కూడా అందరిని అలా మాయ చేస్తుంది. నందమూరి ఫ్యాన్స్, టీడీపీ ఫ్యాన్స్ కి మాత్రం పండగే, సామాన్య ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుంది ఈ సినిమా, ఫాస్ట్ పేస్ మూవీస్ కావాలనుకునే వారు ఈ సినిమాని ఒక్క సారి చూడొచ్చు.

 

అయన జీవితం మొదలు :

అన్న గారి జీవితం లో ఎన్ని ఎత్తుపల్లాలు చూసారు అనేది ఈ సినిమాలో చాలా బాగా చూపించారు, ముఖ్యంగా బుర్ర సాయి మాధవ్ డైలాగ్స్ బాలయ్య నోటి నుండి తూటాల్లాగా పేలాయి, అన్న గారు ఆ నాడు సినిమాల్లో ధరించిన వేషాలని బాలకృష్ణ కూడా ధరించి చూపించారు. ఫిబ్రవరి 7వ తారీఖున రాబోతున్న మహానాయకుడు సినిమా కోసం ఎదురు చూసే వారి సంఖ్య ఎక్కువ కానుంది.

అమెరికా లో ప్రీమియర్స్ తోనే $400K+ కి పైగా కలెక్షన్స్ ని సాధించింది ఈ చిత్రం. మిలియన్ మార్క్ దిశగా దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా కు ఓవర్సీస్ లో రజినీకాంత్ పేట, వెంకటేష్ F2 విచిత్రాల నుండి గట్టి పోటీ ఎదురుకోనుంది.

Positives :

బాలకృష్ణ నటన
నటీనటుల నటన
నేపధ్య సంగీతం
డైలాగ్స్
క్లైమాక్స్

Negatives :

మొదటి భాగం లో కొన్ని సీన్స్, చిత్ర నిడివి.

Review Rating:  3/5

 

Comments

comments

Share this post

scroll to top