ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో వచ్చిన “జై లవకుశ” హిట్టా.? ఫట్టా.? స్టోరీ, రివ్యూ & రేటింగ్ (తెలుగులో)

Krishna

Movie Title (చిత్రం): జై లవకుశ (Jai Lava Kusha)

Cast & Crew:

 • నటీనటులు: జూ. యన్ టి అర్, రాశి ఖన్నా, నివేథా థామస్ ,పోసాని కృష్ణ‌ముర‌ళీ, బ్ర‌హ్మాజీ,సాయికుమా,ప్ర‌దీప్ రావ‌త్‌ తదితరులు.
 • సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
 • నిర్మాత: నందమూరి కళ్యాణ్ రామ్(యన్ టి అర్ ఆర్ట్స్)
 • దర్శకత్వం: కే. ఎస్ రవీంద్ర (బాబీ)
 • ఛాయాగ్రహణం: చోటా కె.నాయుడు

Story:

జై, లవ, కుశ (ముగ్గురు ఎన్టీఆర్‌లు) కవల సోదరులు. జైకి నత్తి. సరిగా మాట్లాడలేడు. అందుకే మిగిలిన ఇద్దరు సోదరులతో కలవలేడు. లవ, కుశ కూడా జైని చిన్న చూపు చూస్తారు. ఈ కారణంగా చిన్నప్పుడే తన సోదరులపై కోపం పెంచుకొంటాడు జై. ప్రమదవశాత్తూ అన్నదమ్ములు ముగ్గురూ… చిన్నప్పుడే తప్పిపోతారు. లవ కుమార్‌ పెరిగి పెద్దవాడై బ్యాంకు ఉద్యోగిగా స్థిరపడతాడు. కుశ ఏదోలా మాయ చేసి, అమెరికా వెళ్లి, గ్రీన్‌ కార్డ్‌ సంపాదించి అక్కడే సెటిలవ్వాలని కలగంటాడు. వీరిద్దరి జీవితాల్లోకి ‘జై’ ప్రవేశిస్తాడు. చిన్నప్పటి పగనీ, ప్రతీకారాన్నీ ఎలా తీర్చుకొన్నాడు? తన ఎదుగుదలకు వీళ్లని ఎలా వాడుకొన్నాడు? ఈ ముగ్గురూ కలిశారా? కలిసుంటూనే ఒకరిపై మరొకరు పోరాటం చేశారా? చివరికు ఏం జరిగిందన్నదే మిగిలిన కథ.

Review:

ఎన్టీఆర్‌ ఒక్కడే ఈ సినిమాని ముందుండి నడిపిస్తాడు. తన నటన, డైలాగులు, వినోదం, డాన్సులతో అడుగడుగునా రక్తికట్టిస్తాడు. తొలి పదిహేను నిమిషాలూ.. తెరపై కేవలం కథే కనిపిస్తుంది. కవలసోదరుల బాల్యం, విడిపోవడం, పెరిగి పెద్దవారవడం… ఈ సన్నిశాలతో నడిపించాడు. ఆ తరవాత ఒక్కో పాత్రనీ పరిచయం చేశాడు. ఈ కథలో జై పాత్ర కీలకం. కానీ తన పాత్ర కనిపించేవరకు కుశ బాగా ఎంటర్‌టైన్‌ చేస్తాడు. విశ్రాంతి ఘట్టం నుంచి ‘జై’ విశ్వరూపం మొదలవుతుంది. అక్కడక్కడ కుశ వినోదం పంచుతూ వెళ్తాడు. పాటలను సందర్భానికి తగ్గట్టు వాడుకొన్నారు. అందులో ఎన్టీఆర్‌ వేసిన స్టెప్పులు ఉత్సాహపరుస్తాయి. మూడు పాత్రల్లో వైవిధ్యం బాగా చూపించగలిగాడు ఎన్టీఆర్‌. డాన్సులో యథవిధిగా రెచ్చిపోయాడు. రాశీఖన్నా గ్లామరెస్‌గా కనిపించింది. నివేదా పాత్ర కూడా కీలకమే. కానీ ఇద్దరి స్క్రీన్‌ ప్రెజెన్స్‌ చాలా తక్కువ. తమన్నా ఓ పాటలో మెరిసింది. అయితే అక్కడా ఎన్టీఆర్‌ డామినేషనే కనిపించింది. దేవిశ్రీ సంగీతం ఆకట్టుకొంది. పాటల్లో కంటే, నేపథ్య సంగీతం విషయంలో చాలా శ్రద్ధ తీసుకొన్నాడు. ‘జై’ పాత్రని ఎలివేట్‌ చేసేలా రూపొందించిన ‘రావణా..’ పాట ఆకట్టుకొంటుంది.

Plus Points:

 • ద‌ర్శ‌కుడు బాబి క‌థ‌ మెస్మ‌రేజ్ చేసేలా ఉంది
 • యాక్ష‌న్ ఎలిమెంట్స్, క్లైమాక్స్
 • ఎన్టీఆర్ మూడు పాత్ర‌ల్లోను న‌ట విశ్వ‌రూపం చూపించాడు
 • హీరోయిన్లు రాశీఖ‌న్నా, నివేదా థామ‌స్ యాక్టింగ్ సూప‌ర్బ్‌
 • ఎన్టీఆర్ కామెడీ, డ్యాన్సు, డైలాగ్స్
 • దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్
 • చోటా కే . నాయుడు సినిమాటోగ్రఫీ
 • ముఖ్య పాత్రల్లో నందిత , హంస నందిని

Minus Points:

 • కొన్ని లెంగ్త్ సీన్స్
 • సాగదీసిన కథ

Final Verdict:

కథ మాములే..ఎన్టీఆర్ నటవిశ్వరూపంతో ఆడియన్స్ ని కట్టిపడేసాడు.

AP2TG Rating: 3.75 / 5

Trailer:

Comments

comments