ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల అత్యవసర భేటి?

హరికృష్ణ  నివాసంలో బాలకృష్ణ ,జూనియర్ ఎన్టీఆర్,పురంధేశ్వరి, మురళీ మోహన్ లు సమావేశమయినట్టు సమాచారం. నోటు కు ఓటు కేసు గురించి చర్చించినట్టు  సమాచారం. ఇప్పటికే ఈ కేసు కు సంబంధించి ఏసిబి దూకుడు గా వ్యవహరిస్తుంది. టిడిపి ఎమ్మెల్సీ  అభ్యర్థిగా బరిలో నిలిచిన వేం నరేంధర్ రెడ్డి ని  ఏసిబి అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో రేవంత్ అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్నారు.మరో ఎమ్మెల్యే సండ్ర  వెంకట వీరయ్యకు కూడా ఇదే కేసులో నోటీసులు కూడా జారీ చేశారు.

ntr-balakrishna-harikrishna

ఈ మొత్తం వ్యవహారం గురించి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చర్చిస్తున్నట్టు సమాచారం.చంద్రబాబు కు నోటీసులు అందితే ఎలా వ్యవహరించాలి .బాబును అరెస్ట్ చేస్తే పార్టీ పరిస్థితి ఏంటి అనే అంశాలపై చర్చిస్తున్నారనే పుకార్లు వినిపిస్తున్నాయి.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top