బ్రేకింగ్ న్యూస్ : ఎన్టీఆర్ బయోపిక్ లో బాలయ్య పక్కన మహేష్ , మహేష్ రోల్ ఎదో తెలుసా ??

నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ బయోపిక్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడి మార్పు కారణంగా ఆలస్యమైన ఈప్రాజెక్ట్‌ను వచ్చే నెలలో సెట్స్‌మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అదే సమయంలో నటీనటుల ఎపింక కూడా జరుగుతోంది.

ఇప్పటికే కీలక పాత్రలకు పలువురిని ఫైనల్‌ చేసినట్టుగా తెలుస్తోంది. బాలకృష్ణ స్వయంగా తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నటిస్తుండగా బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరో కీలక పాత్ర నాదెండ్ల భాస్కరరావు పాత్రలో శరత్‌ కేడ్కర్‌ను ఫైనల్ చేశారు. తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ సమకాలీన నటులైన ఏఎన్నార్‌, కృష్ణ పాత్రలకు వారి వారసులను సంప్రదిస్తున్నారట. అక్కినేని పాత్రలో నాగచైతన్య, కృష్ణ పాత్రలో మహేష్ బాబును నటింప చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్‌ బయోపిక్‌లో నటించేందుకు చైతూ, మహేష్‌లు అంగీకరిస్తారో లేదో చూడాలి.

 

 

 

Comments

comments

Share this post

scroll to top