ఈ 4 హీరోలు “అర్జున్ రెడ్డి” డైలాగ్ చెప్తే ఎలా ఉంటుందో తెలుసా..? అతను చేసిన మిమిక్రీకి ఫిదా అవ్వాల్సిందే..!

credits: Sunny Vinayak Ram

అందరూ డబ్ స్మాష్ లు,మాష్ అప్ లు అంటూ వాటి వెనుక పరుగులు తీస్తుంటే ఎవరో ఒకరుంటారు డిఫరెంట్ గా ట్రై చేయాలనుకునేవారు..అలాంటి వాడే అత్తిలి వినాయక్ రమ్..అత్తిలి అనే పేరు వింటుంటేనే వైబ్రేషన్స్ వచ్చేస్తున్నాయి కదా..ఇంతకీ ఇతడు చేసిందేంటో తెలుసా మిమిక్రీ..ఎన్టీయార్,ఎఎన్ ఆర్,బాలక్రిష్ణలను ఇమిటేట్ చేస్తూ డైలాగ్స్ చెప్పి యూట్యూబ్ లో పెట్టాడు..అబ్బే మిమిక్రీ యా..అయినా మాకు డబ్ స్మాష్ లే నచ్చుతాయి అంటారా..ఒక్కసారి ఇతడి వీడియోస్ చూస్తే మీరే మళ్లీ మళ్లీ చూస్తారు..ఇంతకీ ఇతను మిమిక్రీ చేసింది ఏ డైలాగ్సో తెలుసా..ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీనే అల్లల్లాడించిన అర్జున్ రెడ్డి సినిమాలోని విజయ్ దేవరకొండ చెప్పే డైలాగ్స్ ..ఆ డైలాగ్స్ విషయంలో ఎంత రచ్చ జరిగిందో మనందరికి తెలిసిందే..కానీ అవే డైలాగ్స్ ని నటసింహం నందమూరి,ఎఎన్ ఆర్,బాలక్రిష్ణ వీళ్లు చెప్తే ఎలా ఉంటందో మిమిక్రీ చేసి ,ఆ వీడియోస్ యూట్యూబ్ లో అప్ లోడ్ చేసాడు…ఆ వీడియోస్ చూస్తే మాకైతే నవ్వాగలేదు..మీరూ ఓ లుక్కేయండీ..

ఎన్టీయార్ 

తెలుగు సిని చరిత్రలో ఎన్టీయార్ ది చెరగని స్థానం.డైలాగులు స్పష్టంగా చెప్పడంలో ఎన్టీయార్,ఎస్వీఆర్ తర్వాతే ఎవరైనా..ఏమంటివి ఏమంటివి అంటూ గుక్క తిప్పుకోకుండా డైలాగ్ చెప్పిన ఎన్టీయార్ ఏమాట్లాడుతున్నావ్ రా మాదర్చోద్ అనే డైలాగ్ చెప్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి..ఊహకు అందట్లేదా ..అయితే ఒకసారి ఈ వీడియో చూడండి..

 బాలక్రిష్ణ

చూడూ ఒకవైపే చూడు..అంటూ బాలయ్య డైలాగ్స్ డబ్ స్మాష్ లో చాలా ఫేమస్..అదే బాలయ్య నోట అధ్యాపకురాలికి అర్దం కాకుండా ఒక్క ముక్క ఆంగ్లం మాట్లాడకుండా అనే డైలాగ్ ఎలా ఉంటుందో ఈ వీడియో చూడండి..

 నాగేశ్వర్రావు

అర్జున్ రెడ్డి డైలాగ్ లు అలనాటి మన దేవదాసు అక్కినేని నాగేశ్వర్రావ్ చెప్తే ఎలా ఉంటుందో తెలుసా..ఇలా ఉంటుంది.

 సాయికుమార్

చట్టానికి ,న్యాయానికి,ధర్మానికి కనిపించే మూడు సింహాలు ప్రతీకలైతే కనపడని నాలుగో సింహమేరా ఈ పోలీస్ అంటూ సాయికుమార్ ఇరవైఏళ్లక్రితం చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ఫేమస్..అలాంటి సాయికుమార్ అర్జున్ రెడ్డి డైలాగ్ లు చెప్తే ఎలా ఉంటుందో చూడండి..

Comments

comments

Share this post

scroll to top