5 నిమిషాల్లోనే పాన్ కార్డ్ చేతికంద‌నుంది!!

ప‌ర్మినెంట్ అకౌంట్ నంబ‌ర్. దీన్నే పాన్ అని కూడా అంటారు. ఈ కార్డు ఉంటే ఆర్థిక లావాదేవీలు సుల‌భ‌త‌ర‌మ‌వుతుంది. ఫైనాన్స్ సంస్థ‌లు లోన్స్ ఇవ్వ‌డానికి, ప‌రిమితికి మించిన ఆర్థిక లావాదేవీలు నిర్వ‌హించే సంద‌ర్భంలో, ట్యాక్స్ క‌ట్టేడ‌ప్పుడు పాన్ నంబ‌ర్ ఎంత‌గానో ఉపయోగ‌ప‌డుతుంది. అయితే ఎవ‌రికైనా పాన్ నంబ‌ర్, ఆ నంబ‌ర్‌తో కూడిన కార్డ్ రావాలంటే అందుకు వారు ముందుగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సిందే. ఆ త‌రువాత కొన్ని రోజుల పాటు వేచి చూస్తే అప్పుడు పాన్ కార్డు చేతికందుతుంది. మ‌రి… ఈ మ‌ధ్య కాలంలో పాన్ నంబ‌ర్ అవ‌స‌రం అయితే ఎలా..? అంటే త‌ప్ప‌దు మ‌రి. పాన్ కార్డు వ‌చ్చేదాకా వేచి చూడాల్సిందే. అయితే ఇక‌పై ఈ ఇబ్బందికి చెక్ పెట్ట‌నుంది కేంద్ర ప్ర‌భుత్వం.

permanent-account-number

కేంద్ర ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే ఓ వినూత్నమైన కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్ట‌నుంది. దాని ద్వారా ఇక‌పై ఎవ‌రైనా కేవ‌లం 5 నిమిషాల్లోనే పాన్ కార్డును పొంద‌వ‌చ్చు. ప్ర‌స్తుతం ఆధార్ కార్డుతో బ‌యోమెట్రిక్ వెరిఫై చేసుకుని సిమ్ కార్డులు ఇస్తున్నారు క‌దా, స‌రిగ్గా ఇదే కోవ‌లో వ్య‌క్తుల ఆధార్ నంబ‌ర్ల‌ను బ‌యోమెట్రిక్ వెరిఫికేష‌న్ ద్వారా పూర్తి చేసి కేవ‌లం 5 నిమిషాల్లోనే పాన్ నంబ‌ర్‌ను ఇవ్వ‌నున్నారు. అదే కార్డు కోసం అయితే వేచి చూడాల్సి ఉంటుంది. కానీ పాన్ నంబ‌ర్ అయితే వెంట‌నే వ‌స్తుంది క‌దా, దాంతో ఆర్థిక లావాదేవీల నిర్వ‌హ‌ణ‌కు ఎలాంటి ఇబ్బందీ ఉండ‌దు.

అయితే పాన్ నంబ‌ర్‌ను ఇలా కేవ‌లం 5 నిమిషాల్లోనే జారీ చేసే కార్య‌క్ర‌మానికి తోడు కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో కొత్త యాప్‌ను కూడా తీసుకురానుంది. దాంతో స్మార్ట్‌ఫోన్ ద్వారానే చాలా సుల‌భంగా ఇన్‌క‌మ్‌ట్యాక్స్ వంటివి క‌ట్ట‌వ‌చ్చు. కేవ‌లం ఒకే ట‌చ్‌తో ట్యాక్స్ ప‌ని పూర్త‌య్యేలా ఆ యాప్‌ను అభివృద్ధి చేస్తున్నారు సంబంధిత అధికారులు. దీని వ‌ల్ల ఎంత‌గానో స‌మ‌యం ఆదా అవుతుంది. దీంతోపాటు ఆ యాప్ ద్వారానే పాన్ కార్డుకు అప్లై చేసుకునేలా దాన్ని తీర్చిదిద్ద‌నున్నారు. వినియోగ‌దారులు తాము క‌ట్టిన ట్యాక్స్ వివ‌రాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ట్రాక్ చేసుకునే వెసులుబాటు కూడా ఈ యాప్‌లో క‌ల్పించ‌నున్న‌ట్టు తెలిసింది.

Comments

comments

Share this post

scroll to top