ఏ సంస్థ‌ల్లో ప‌నిచేసే మ‌హిళ‌ల‌కైనా….ఇక మీద‌ట 26 వారాల ప్ర‌సూతి సెల‌వులు!!

ఏ రంగంలోనైనా, ఏ స్థానంలోనైనా ప‌నిచేసే మ‌హిళ‌ల‌కు ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల్లో ఒక‌టి ప్ర‌సూతి సెల‌వు. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హిళ‌ల‌కు 12 వారాలు అంటే 3 నెల‌లు మాత్ర‌మే మెట‌ర్నిటీ సెల‌వులు ఉండేవి. అయితే ఇప్పుడా కోటా పెరిగింది. మ‌హిళ‌ల‌కు ప్ర‌సూతి సెల‌వుల సంఖ్య‌ను పెంచారు. ఇప్పుడు వారు 26 వారాల పాటు అంటే దాదాపుగా 6 నెల‌ల వ‌ర‌కు ప్ర‌సూతి సెల‌వుల‌ను పొంద‌వ‌చ్చు. అందుకు గాను ఓ నూత‌న బిల్లును తాజాగా పార్ల‌మెంట్ ఆమోదించింది.

pregnant-woman-leaves

10 మంది అంత‌క‌న్నా ఎక్కువ ఉద్యోగులు ఉన్న సంస్థ‌లో పనిచేస్తున్న మ‌హిళ‌లు ఇక‌పై 26 వారాల పాటు ప్ర‌సూతి సెల‌వుల‌ను పొంద‌వ‌చ్చు. అందుకు గాను ఆయా కంపెనీలు క‌చ్చితంగా వారికి సెల‌వుల‌ను ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మొద‌టి ఇద్ద‌రు సంతానానికి మాత్ర‌మే ఈ సెల‌వులు వ‌ర్తిస్తాయి. మ‌హిళ 3వ సంతానం క‌నాలనుకుంటే అప్పుడు ఆమెకు ముందు ఉన్న‌ట్టుగా 12 వారాల సెల‌వు మాత్ర‌మే ఇస్తారు. ఈ క్ర‌మంలో 50 మంది క‌న్నా ఎక్కువ ఉద్యోగులు ఉన్న సంస్థ‌లో ప‌నిచేస్తున్న మ‌హిళల చిన్నారులకు గాను ఆయా సంస్థ‌లు విధిగా క్ర‌చ్‌ల‌ను ఏర్పాటు చేయాలి.

parliament

working-women

ఇక 3 నెలలు అంత‌క‌న్నా త‌క్కువ వ‌య‌స్సు ఉన్న పిల్ల‌ల‌ను ద‌త్త‌త తీసుకునే మ‌హిళ‌ల‌కు కూడా ప్ర‌సూతి సెల‌వులు ఇస్తున్నారు. వారికి కూడా 12 వారాల పాటు సెల‌వుల‌ను ఆయా కంపెనీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మెటర్న‌టి బెనిఫిట్ బిల్ 2016 ముందుగా రాజ్య‌స‌భ‌లో ఆమోదం పొంద‌గా తాజా జ‌రుగుతున్న పార్ల‌మెంట్ స‌మావేశాల్లో లోక్ స‌భ‌లోనూ ఈ బిల్లు ఆమోదం పొందింది. దీంతో ఇప్ప‌టి నుంచే ఈ చ‌ట్టం అమ‌లులోకి రానుంది. అయితే ఇలా 26 వారాల పాటు మ‌హిళ‌ల‌కు మెట‌ర్నిటీ లీవ్ ఇస్తున్న దేశాల్లో మన దేశం 3వ స్థానంలో నిల‌వ‌డం విశేషం. కెన‌డాలో మ‌హిళ‌ల‌కు 50 వారాల వ‌ర‌కు మెటర్నిటీ లీవ్స్ ఇస్తుండ‌గా అందుకు గాను ఆ దేశం మొద‌టి స్థానంలో ఉంది. ఇక నార్వేలో మ‌హిళ‌ల‌కు 44 వారాల ప్ర‌సూతి సెల‌వుల‌ను ఇస్తున్నారు. దీంతో ఆ దేశం రెండో స్థానంలో నిలిచింది. ఆ త‌రువాత మ‌న దేశ‌మే ఉంది. అయితే తాజాగా అమ‌లులోకి వ‌చ్చిన ఈ బిల్లు ద్వారా దాదాపుగా 1.8 కోట్ల మంది మ‌హిళ‌ల‌కు బెనిఫిట్ అవుతుంద‌ని భావిస్తున్నారు.

Comments

comments

Share this post

scroll to top