అత‌నికి ఒక‌ప్పుడు స్కూల్ ఫీజు క‌ట్టేందుకు డ‌బ్బు లేదు…ఇప్పుడు అతన్ని ఎన్ని కోట్లకు కొన్నారో తెలుసా.?

టాలెంట్ అంటూ ఉండాలే గానీ ఎవ‌రికైనా ఎప్ప‌టికైనా త‌ప్పక గుర్తింపు ల‌భిస్తుంది. అప్ప‌టి వ‌ర‌కు ప‌డిన క‌ష్టానికి త‌గిన ఫ‌లితం దొరుకుతుంది. ఆ యువ క్రికెట‌ర్ విష‌యంలోనూ ఇలాగే జ‌రిగింది. ఒక‌ప్పుడ అతని వద్ద స్కూల్ ఫీజు క‌ట్టేందుకే డ‌బ్బులు లేవు. అయినా ఓ వైపు చ‌దువు మాన‌లేదు. మ‌రో వైపు క్రికెట్‌లో కోచింగ్ తీసుకోవ‌డ‌మూ విర‌మించ‌లేదు. దీంతో ఇప్పుడు టాప్ క్రికెట్ క్రీడాకారుడు అవ‌డ‌మే కాదు, తాజాగా నిర్వ‌హించిన ఐపీఎల్ వేలంలో అత‌ను ఏకంగా రూ.3.2o కోట్ల ధ‌ర ప‌లికాడు. కోల్‌క‌తా టీం అత‌న్ని అంత మొత్తం చెల్లించి కొనుగోలు చేసింది. ఇంత‌కీ ఆ క్రికెట‌ర్ ఎవ‌రంటే…

అత‌ని పేరు క‌మ్లేష్ న‌గ‌ర్‌కోటి. జైపూర్ వాసి. క‌మ్లేష్ ది పేద కుటుంబం. అత‌ని త‌ల్లిదండ్రులు కూలి ప‌ని చేసే వారు. అత‌న్ని క‌ష్ట ప‌డి చ‌దివించేవారు. అయితే చిన్న‌ప్పుడు అంద‌రూ ఆడిన‌ట్టుగానే క‌మ్లేష్ కూడా గ‌ల్లీ క్రికెట్ ఆడేవాడు. అలా ఓ రోజు త‌మ వీధిలో టెన్నిస్ బాల్‌తో క్రికెట్ ఆడుతుండ‌గా కోచ్ సురేంద్ర రాథోడ్ చూశారు. దీంతో క‌మ్లేష్‌లో ఉన్న ప్ర‌తిభ‌ను అప్ప‌ట్లోనే ఆయ‌న గ‌మ‌నించారు. అనంత‌రం ఆయ‌న నేరుగా క‌మ్లేష్ ఇంటికి వెళ్లి అత‌ని త‌ల్లిదండ్రుల‌తో మాట్లాడాడు. అప్ప‌టి నుంచి సురేంద్ర రాథోడ్ శిక్ష‌ణ‌లో క‌మ్లేష్ రాటు దేలాడు.

అయితే క్రికెట్ కోచింగ్‌కు సురేంద్ర రాథోడ్ నుంచి అన్ని విధాలుగా స‌హ‌కారం అందిన‌ప్ప‌టికీ క‌మ్లేష్‌కు మాత్రం చదువుకు కావ‌ల్సిన డ‌బ్బు ఉండేది కాదు. స్కూల్ ఫీజు క‌ట్టేందుకు అత‌ను ఎప్పుడూ ఇబ్బంది ప‌డేవాడు. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన రాథోడ్ క‌మ్లేష్ చ‌దువుతున్న స్కూల్ ప్రిన్సిపాల్‌తో మాట్లాడి ఆ స‌మ‌స్య‌ను కూడా తీర్చారు. దీంతో ఇక క‌మ్లేష్‌కు వెనుదిగిరి చూసే అవ‌కాశం లేక‌పోయింది. క్రికెట్‌లో రాణించ‌డం మొద‌లు పెట్టాడు. అనేక టోర్న‌మెంట్‌లు ఆడి స‌త్తా చాటాడు. ఇప్పుడు ఏకంగా అండ‌ర్ 19 టీంకు సెలెక్ట్ అయి అందులో ఆడుతున్నాడు. ఈ క్ర‌మంలోనే అత‌ను చూపుతున్న ప్ర‌తిభ‌కు, బౌలింగ్ స్కిల్స్‌కు తాజాగా నిర్వ‌హించిన ఐపీఎల్ వేలంలో అత‌న్ని కోల్‌క‌తా నైట్ రైడర్స్ జ‌ట్టు ఏకంగా రూ.3.20 కోట్ల‌ను ఇచ్చి క‌మ్లేష్‌ను కొనుగోలు చేసింది. దీంతో క‌మ్లేష్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ఇక త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఐపీఎల్ 11వ సీజ‌న్‌లో స‌త్తా చాటి జాతీయ క్రికెట్ జ‌ట్టుకు ఎంపిక‌వుతానంటున్నాడు క‌మ్లేష్‌. అత‌ని క‌ల సాకారం కావాల‌ని మ‌న‌మూ ఆశిద్దాం..!

Comments

comments

Share this post

scroll to top