గోవాలో ఇక‌పై బ‌హిరంగ ప్ర‌దేశాల్లో మ‌ద్యం సేవించ‌కూడ‌దు. ఎందుకో తెలుసా..?

గోవా… ఈ పేరు చెప్ప‌గానే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేవి అంద‌మైన బీచ్‌లు. ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం. బికినీ భామ‌లు. స్వ‌దేశీ, విదేశీ అందాలు… ఇవి మ‌న‌కు ప్ర‌ధానంగా క‌నిపిస్తాయి. దీంతోపాటు మ‌ద్యం ప్రియులు గోవాలో పండ‌గ చేసుకుంటారు. అక్క‌డ అది చాలా చ‌వ‌క‌గా ల‌భించ‌డ‌మే అందుకు కార‌ణం. దీంతోపాటు రాత్రిపూట ఇక బీచ్‌ల‌లో భూత‌ల స్వ‌ర్గ‌ధామంలా అనిపిస్తుంది. అంత‌టి ఎంజాయ్‌మెంట్ గోవాలో ఉంటుంది. అయితే… ఒక్క విష‌యం… అదేమిటంటే… ఈ ఎంజాయ్‌మెంట్ అంతా ఓకే. కానీ ఇక‌పై గోవాలో బ‌హిరంగ ప్ర‌దేశాల్లో… అంటే.. బీచ్ లు ఇత‌ర పబ్లిక్ ప్లేసెస్‌లో మ‌ద్యం సేవించ‌రాదు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. అక్క‌డి పోలీసులు తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇక‌పై గోవాలో బ‌హిరంగ ప్ర‌దేశాల్లో మ‌ద్యం సేవిస్తే పోలీసులు అరెస్టు చేస్తారు. ఆపై ఐపీసీ సెక్ష‌న్ 34 ప్ర‌కారం కేసు పెడ‌తారు. అనంత‌రం నేరం రుజువైతే జైలు శిక్ష కూడా వేస్తారు. క‌నుక ఇక ముందు మీరు గోవా వెళితే అక్క‌డ బ‌హిరంగ ప్ర‌దేశాల్లో మ‌ద్యం తాగ‌డం మానుకోండి. బీచ్ లైనా, వేరే ఏ ప‌బ్లిక్ ప్లేస్ అయినా టూరిస్టులు లేదా స్థానికులు ఎవ‌రైనా అక్క‌డ అలా మందు తాగ‌కూడ‌దు. ఈ మ‌ధ్యే గోవాకు చెందిన కొంద‌రు స్థానికులు, టూరిజం సంస్థ‌ల‌కు చెందిన ప్ర‌తినిధులు, పోలీసులు క‌లిసి మీటింగ్ పెట్టి మ‌రీ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే ఇంత‌కీ ఇంత స‌డెన్‌గా పోలీసులు ఈ నిర్ణ‌యం ఎందుకు తీసుకున్నారో తెలుసా..? అందుకు కార‌ణాలు ఉన్నాయి లెండి.

గోవాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న కొందరు పబ్లిగ్గా బాగా న్యూసెన్స్ చేస్తున్నారు. అసభ్యకర స్థితిలో తిరుగుతున్నారు. మద్యం సేవించి సముద్రంలో చాలా మంది టూరిస్టులు మునిగిపోతున్నారు. బీచ్‌లలో మద్యం సేవించాక వాటి తాలూకు బాటిల్స్‌ను అలాగే వదిలేస్తున్నారు. అవి ఇసుకలో కూరుకుపోయి ఇతర టూరిస్టులకు గాయాలవుతున్నాయి. అలాగే మద్యం సేవించి వాహనాలు నడుపుతూ అనేక మంది ప్రమాదాల బారిన పడుతున్నారు. దీంతోపాటు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తుండడం వల్ల గోవా ఇమేజ్ పడిపోతుందట. అందుకే… ఈ కారణాల వల్లే గోవాలో బ‌హిరంగ ప్ర‌దేశాల్లో మ‌ద్యం సేవించ‌డంపై నిషేధం పెట్టారు. అయినా… అక్క‌డికి ఎవ‌రు వెళ్లినా… మొద‌ట కోరుకునేది అలా మ‌ద్యం సేవిస్తూ ఎంజాయ్ చేయాల‌నే..! అలాంటిది ఈ కొత్త రూల్ పెడితే వ‌చ్చే టూరిస్టులు కూడా తుర్రుమంటారు క‌దా..! ఏమంటారు..!

Comments

comments

Share this post

scroll to top