ఇక‌పై ఫ్రీ ఆఫ‌ర్లు, డిస్కౌంట్ల‌ను వ్యాపారులు, కంపెనీలు, మాల్స్ అందించ‌వు. ఎందుకో తెలుసా..?

ఒక‌టి ఒక‌టి కొంటే ఒక‌టి ఉచితం, బై వ‌న్ గెట్ వ‌న్ ఫ్రీ… ఒక‌టి కొంటే రెండు ఉచితం… మూడు ఉచితం… మా ద‌గ్గ‌ర వ‌స్తువులు కొంటే 50 శాతం డిస్కౌంట్ ఇస్తాం. మా ద‌గ్గ‌ర షాపింగ్ చేస్తే 80 శాతం రాయితీ ఇస్తాం… ఇదిగో ఇలా ఉంటున్నాయి మాల్స్‌, దుకాణ‌దారుల ఆఫ‌ర్లు. నేటి త‌రుణంలో వ్యాపారులు త‌మ లావాదేవీల‌ను పెంచుకోవ‌డం కోసం, లాభాల కోసం ఫ్రీ, డిస్కౌంట్ ఆఫ‌ర్ల‌ను అందిస్తున్నారు. అయితే ఇక‌పై ఈ ఫ్రీ ఆఫ‌ర్లు, రాయితీలు ఉండ‌వు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. చాలా వ‌ర‌కు కంపెనీలు, మాల్స్‌, దుకాణ‌దారులు, ఆఖ‌రికి హోట‌ల్స్‌, రెస్టారెంట్స్ కూడా వీటికి మంగ‌ళం పాడుతున్నాయి. ఎందుకో తెలుసా..?

జీఎస్‌టీ వ‌ల్ల‌. అవును మీరు విన్న‌ది క‌రెక్టే. జీఎస్‌టీ వ‌ల్లే వ్యాపారులు ఇకపై ఫ్రీ ఆఫ‌ర్లు, డిస్కౌంట్ల‌ను నిలిపివేయ‌నున్నారు. ఎందుకంటే వ్యాపారులు మ‌న‌కు ఉచితంగా అందించే వ‌స్తువుల‌పై కూడా జీఎస్‌టీ ప్ర‌కారం ప‌న్ను క‌ట్టాల‌ట‌. ఉచితంగా ఇస్తే వారికి అందే ఇన్‌పుట్ స‌బ్సిడీ పోతుంద‌ట‌. క‌నుక వారు ఉచితంగా వ‌స్తువుల‌ను ఇవ్వ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నారు. దానికి బ‌దులుగా వారు వ‌స్తువు ధ‌ర‌ను కొంత త‌గ్గించి ఇస్తార‌ట‌. దీన్ని బ‌ట్టి మ‌న‌కు తెలిసింది ఏమిటంటే… ఇక‌పై మ‌నం ఫ్రీ ఆఫ‌ర్లకు చెందిన యాడ్‌ల‌ను చూడం. క‌నుక మీరు కూడా అదే యావ‌లో ఉండి ఫ్రీ ఆఫ‌ర్ల కోసం ఆశించ‌కండి. లేదంటే ఆఫ‌ర్ ఉంద‌నే ఆలోచ‌న‌లో ఉంటే తీరా ఆ ఆఫ‌ర్ లేద‌ని తెలిస్తే మీకు ఆశాభంగం అవుతుంది.

కాగా దేశవ్యాప్తంగా అతిపెద్ద బిస్కెట్, ఇతర ఆహార ప‌దార్థాల విక్రయ కంపెనీ పార్లె ఇప్పటికే ఫ్రీ ఆఫర్స్ ను బంద్ చేసింది. కస్టమర్లకు డిస్కౌంట్ రూపంలో ఇవ్వాలని, ఉచితం లేదని ప్రకటించేసింది. ఈ బాటలోనే పిజ్జా, బర్గర్ అందించే డొమినోస్, యమ్ రెస్టారెంట్లు కూడా ఇదే ప్రకటన చేశాయి. రెండు పిజ్జాలు కొంటే మూడోది ఫ్రీ అని ఇప్పటి వరకు చెప్పాం, ఇక నుంచి ఫ్రీ ఇవ్వలేం. కావాలంటే మూడో పిజ్జాకు డిస్కౌంట్ ఇస్తాం అని ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చేసింది డొమినోస్. మూడో పిజ్జా మీకు ఫ్రీగా ఇచ్చి మేం పన్ను కట్టాల్సి వస్తుంది. ఇన్ పుట్ సబ్సిడీ కూడా భరించాల్సి ఉంటుంది. ఇది కంపెనీకి నష్టం అంటున్నారు పిజ్జా హట్ ప్ర‌తినిధులు. ఒక్క ఫుడ్ కంపెనీలే కాదు, ఫార్మా కంపెనీలు సేల్స్ వ్యూహాలను మారుస్తున్నాయి. ఏదైనా వస్తువును ఉచితంగా అందించిన ప్రతిసారీ దాని విలువ GST పరిధిలోకి వస్తుంది. దాన్ని వినియోగదారులపై వేయలేరు. అలా అని చెప్పి ఆ భారాన్ని కంపెనీలు కూడా మోయ‌లేవు. క‌నుక ఇక వ్యాపారుల‌కు ఇప్పుడు గ‌త్యంత‌రం లేదు. క‌చ్చితంగా ఫ్రీ ఆఫ‌ర్లు, డిస్కౌంట్ల‌కు రాం రాం చెప్పాల్సిందే. జీఎస్‌టీ వ‌ల్ల వ‌చ్చిన పెను మార్పు ఇది అని కొంద‌రు విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతుండ‌గా, ఇక‌పై ఇలాంటి ఎన్ని చిత్రాలు చూడాల్సి వ‌స్తుందో అని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Comments

comments

Share this post

scroll to top