సెన్సార్ బోర్డు క‌ఠిన నిర్ణ‌యం… ఇక‌పై సినిమాల్లో మ‌ద్యం, పొగ తాగే సీన్లు క‌ట్‌..!

సినిమా థియేట‌ర్ల‌లో సినిమా ఆరంభం అయ్యేందుకు ముందు వ‌చ్చే యాడ్ గుర్తుంది క‌దా. అదేనండీ.. ”ఈ న‌గ‌రానికి ఏమైంది, ఓ వైపు దుమ్ము, మ‌రో వైపు పొగ‌…” అంటూ సిగ‌రెట్ తాగేవారిని ఉద్దేశించి యాడ్ వ‌స్తుంది క‌దా. అవును, అదే. అయితే ఆ యాడ్‌కు జ‌నాలు స్పందించ‌డం లేద‌ట‌. ఆ యాడ్ ఇప్ప‌టికే చాలా ఏళ్ల నుంచి థియేట‌ర్స్‌లో వ‌స్తుంది. టీవీల్లో సినిమా వేసే ముందు కూడా ఈ యాడ్ వేస్తున్నారు. అయితే నిజానికి ఈ యాడ్‌కు పొగ‌రాయుళ్లు స్పందించ‌డం లేద‌ట‌. పైగా వారి సంఖ్య పెరుగుతుంద‌ట‌. దీంతో సెన్సార్ బోర్డు ఓ క‌ఠిన నిర్ణ‌యం తీసుకుంది. అదేమిటంటే…

ఇక‌పై సినిమాల్లో సిగ‌రెట్ తాగే, మ‌ద్యం సేవించే సీన్లు ఉండ‌కూడ‌దు. ఉంటే వాటిని నిర్దాక్షిణ్యంగా క‌ట్ చేస్తార‌ట‌. ఇక కాదు, ఆ సీన్లు ఉండాల్సిందే, కావాలి అనుకుంటే ఆ సినిమాకు ‘A’ స‌ర్టిఫికెట్ ఇస్తార‌ట‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. సెన్సార్ బోర్డు తాజాగా ఈ నిర్ణ‌యం తీసుకుంది. దీనిపై సెంట్రల్ సెన్సార్ బోర్డ్ చీఫ్ ప్రహ్లీజ్ నిహ్లీనీ మాట్లాడుతూ సినిమాల్లో హీరోయిజం బాగా పండాలంటే మందు, సిగరెట్‌ను తప్పనిసరి అన్నట్టుగా సీన్లు తీస్తున్నార‌ని, దీంతో ఆ సీన్ల‌ను యువ‌త అనుక‌రిస్తున్నార‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే వారు దుర‌ల‌వాట్ల బారిన ప‌డుతున్నార‌ని అన్నారు.

ఇప్పటివరకూ సినిమా ప్రారంభంలో ‘పొగతాగడం, మద్యం సేవించడం హానికరం’ అంటూ ప్రేక్షకులకు కనీ కనిపించనీ నోటీసుల‌తో మాత్రమే సరిపెట్టేస్తున్నామని, అయితే వాటివల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు నిహ్లీనీ. నిజంగా ప్రజల మేలు కోరేవారైతే సిగరెట్, మద్యం సీన్స్‌ను సాధ్యమైనంత వరకు తీయకూడదన్నారు. స్టార్ హీరోలకు దేశవ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఉంటార‌ని, వాళ్లల్లో చాలామంది తమ అభిమాన హీరో ఎంత స్టైలిష్‌గా మందు తాగాడు, ఎంత స్టైల్‌గా సిగరెట్ పీల్చుతూ పొగ వదిలాడో గమనిస్తూ వాళ్లని అనుకరించే ఫ్యాన్స్ చాలా మంది ఉంటారన్నారన్నారు. ఇలా ఒకసారి అలవాటు అయితే వాటికి బానిసలుగా మారిపోయే ప్రమాదం ఉందన్నారు ప్రహ్లాజ్ నిహ్లాని. అందుకే ఈ క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్నామ‌ని చెప్పారాయ‌న‌..! చూద్దాం మ‌రి.. దీంతోనైనా పొగ‌రాయుళ్ల‌లో మార్పు వ‌స్తుందో రాదో..!

Comments

comments

Share this post

scroll to top