డ్రగ్స్ కేసు: నోటీసులు అందుకున్న 12 మంది ప్రముఖులు వీరేనా..? ఆ హీరో పేరు చూసి షాక్..!

సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం రేపుతోంది. వారం రోజులుగా జరుగుతున్న విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్‌ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నోటీసులు జారీ చేసిన తెలుగు సినిమా ప్రముఖుల పేర్లు అనధికారికంగా వెల్లడయ్యాయి. ఇందులో ప్రముఖ హీరోతో పాటు దర్శకుడు, ఇతర టెక్నీషియన్లు ఉన్నారు.డ్రగ్స్ కేసులో పట్టుబడిన కెల్విన్‌‌ను విచారిస్తున్న సమయంలో అనేక కొత్త కోణాలు వెలుగు చూశాయి. కెల్విన్‌ కాల్‌డేటా, వాట్సాప్‌ చాటింగ్‌ ఆధారంగా విచారణ జరిపిన అధికారులు.. అతడితో సంబంధమున్న అందరికీ నోటీసులు పంపారు. ఇప్పటి వరకు 19 మందికి నోటీసులు పంపగా అందులో 12 మంది ప్రముఖుల పేర్లు బయటికొచ్చాయి. వీరిని ఈ నెల 19 నుంచి 27 వరకు ప్రశ్నించబోతున్నారు.

నోటీసులు అందుకున్నది వీళ్లేన‌ని…న్యూస్ స‌ర్కులేట్ అవుతుంది:

హీరోలు: రవితేజ, తరుణ్, నవదీప్, తనీష్, నందు, సుబ్బరాజు
హీరోయిన్ చార్మీ, ముమైత్ ఖాన్,
డైరెక్టర్ పూరీ జగన్నాథ్,
కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు,
ఆర్ట్ డైరెక్టర్ చిన్నా
శ్రీనివాసరావు(రవితేజ డ్రైవర్)

డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ ప్రముఖులు నోటీసులు జారీ చేస్తూనే ఉన్నామని, ఇప్పటికే 10 మందికి నోటీసులు ఇచ్చామని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ తెలిపారని సమాచారం.

sources: sakshi, abnandhrajyothy, v6 news

Comments

comments

Share this post

scroll to top