భార్య మంగ‌ళ‌సూత్రం వేసుకోక‌పోవ‌డం, బొట్టు పెట్టుకోక‌పోవ‌డం వంటి కార‌ణాలను చూపితే భ‌ర్త‌కు డైవోర్స్ ఇవ్వ‌ర‌ట‌..!

విదేశాల్లో దంప‌తులు చిన్న చిన్న కార‌ణాల‌కే విడాకులు తీసుకుంటార‌ని అంద‌రికీ తెలిసిందే. అడిగితే కాఫీ ఇవ్వ‌లేద‌నో, న‌చ్చ‌ని డ్రెస్ వేసుకున్నార‌నో, త‌మ వారిని స‌రిగ్గా చూడ‌లేద‌నో, చేసిన వంట న‌చ్చ‌లేద‌నో… లాంటి కార‌ణాలు చెప్పి ఆయా దేశాల్లో దంప‌తులు విడాకులు తీసుకుంటారు. ఇది అక్క‌డ కామ‌న్‌. సాధార‌ణంగా జ‌రిగిదే. అయితే ఇదే క‌ల్చ‌ర్ ఇప్పుడిప్పుడే మ‌న దేశంలోనూ విస్త‌రిస్తోంది. అలాంటి సిల్లీ కార‌ణాలు చెప్పి దంప‌తులు విడాకులు తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో అలా ఓ కార‌ణం చెప్పి భార్య నుంచి డైవోర్స్ అడిగిన భ‌ర్త‌కు ఆ కోర్టు షాకింగ్ లాంటి తీర్పు ఇచ్చింది. ఇంత‌కీ అదేమిటంటే…

ఇటీవ‌లే ఓ వ్య‌క్తి బాంబే హైకోర్టులో అప్పీల్ చేసుకున్నాడు. త‌న భార్య నుంచి త‌న‌కు విడాకులు కావాల‌ని కోరుతూ ఆ వ్య‌క్తి కోర్టులో అప్పీల్ చేశాడు. అయితే భార్య నుంచి భ‌ర్త‌యినా, భ‌ర్త నుంచి భార్య అయినా విడాకులు కోరే క్ర‌మంలో అందుకు త‌గిన కార‌ణాన్ని తెలపాల్సి ఉంటుంది. అప్పుడే న్యాయ‌మూర్తి విడాకులు మంజూరు చేస్తారు. ఈ క్రమంలో భార్య నుంచి డైవోర్స్ పొందేందుకు ఆ వ్య‌క్తి చెప్పిన కార‌ణం ఏదో తెలుసా..? త‌న భార్య మంగ‌ళ‌సూత్రం ధ‌రించ‌డం లేద‌ని, అలాగే నుదుటన బొట్టు కూడా పెట్టుకోవ‌డం లేద‌ని, అది త‌న‌కు అవ‌మాన క‌రంగా ఉంద‌ని అందుకే విడాకులు కావాల‌ని అత‌ను కోర్టుకెక్కాడు.

దీంతో కేసు విచారించిన న్యాయ‌మూర్తి షాకింగ్ లాంటి తీర్పునిచ్చారు. అస‌లు ఆ రెండు కార‌ణాలు స‌రైన‌విగా లేవ‌ని, అవి చాలా సిల్లీ రీజ‌న్స్ అని, వాటిని సాకుగా చూపి విడాకులు కావాల‌ని అడ‌గ‌డం అర్థ ర‌హిత‌మ‌ని, అందుకు డైవోర్స్ మంజూరు చేయ‌లేమ‌ని కోర్టు తీర్పు చెప్పింది. దీంతో ఆ వ్య‌క్తి షాక్‌కు గుర‌య్యాడు. ఓ వివాహిత మ‌హిళ మంగ‌ళ‌సూత్రం వేసుకోవ‌డం, నుదుట‌న సింధూరం (బొట్టు) పెట్టుకోవ‌డం వంటివి ఆమె ఇష్ట‌మ‌ని, వాటిని పాటించాల్సిన అవ‌స‌రం లేద‌ని, ఆమె ఇష్టానికే వ‌దిలేయాల‌ని కోర్టు తీర్పు చెప్పింది. దీంతో ఆ వ్య‌క్తికి డైవోర్స్ మంజూరు కాలేదు. ఏది ఏమైనా… ఇలాంటి తీర్పులు చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటాయి క‌దా..!

Comments

comments

Share this post

scroll to top