మీకు ఈ ముక్కు లెక్కలు తెలుసా? తెలియకపోతే తెలుసుకోండి. మరి మీరే రకం.!!

మన శరీరంలో జ్ఞానేంద్రియాల పాత్ర అత్యంత కీలకమైంది. వాటిలో ప్రతి అవయవానికి ఒక్కో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ముఖ్యంగా వాసనలను పసిగట్టే ముక్కుకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే కేవలం వాసనలను పసిగట్టడం కోసమే కాకుండా దాన్ని చూసి అవతలి వారు ఎలాంటి వారో ఇట్టే చెప్పేయవచ్చట. ముక్కు ఆకృతి, పొడవును బట్టి అవతలి వ్యక్తుల స్వభావం గురించి తెలుసుకోవచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
ముక్కు పెద్దగా ఉంటే… 
ముక్కు పెద్దగా ఉన్న వారు సొంతంగా పనిచేసేందుకే ఇష్ట పడతారట. వీరు అధిక శక్తిమంతులుగా ఉండడమే కాకుండా నాయకత్వ లక్షణాలను కూడా కలిగి ఉంటారట. వీరు తమకు తామే బాస్‌లుగా ఉంటారట. ఎదుటి వారు చెప్పేది ఏ మాత్రం పట్టించుకోరట. కేవలం పెద్ద విషయాల పట్ల మాత్రమే ఆసక్తిని చూపుతారట. చిన్న విషయాలను అస్సలు పట్టించుకోరట.
c2qpneviczkyeponljzi
ముక్కు చిన్నగా ఉంటే…
వీరు సృజనాత్మక శక్తిని కలిగి ఉంటారట. ఎల్లప్పుడూ ఇతరులతో కలిసి పనిచేసేందుకు ఇష్ట పడతారట. వీరికి ఓర్పు, సహనం చాలా తక్కువట. కొన్నిసార్లు విసుగు చెందుతూ ఉంటారట. పనిని ఒక క్రమ పద్ధతిలో చేసేందుకు ఇష్టపడతారట.
kw5xqoktdgq8jez7wi2g
ముక్కు పొడవుగా ఉంటే… 
వీరు వ్యాపార రంగంలో బాగా రాణిస్తారట. జీవితం పట్ల స్పష్టమైన అవగాహనను కలిగి ఉంటారట. వీరి నాయకత్వ లక్షణాలకు ఇతరులు మంత్రముగ్ధులవుతారట. అయితే కొన్ని సందర్భాల్లో వీరి బలాలే బలహీనతలవుతాయట.
hei750smerggwidp25xr
వెడల్పయిన ముక్కు ఉంటే… 
వీరు ఎల్లప్పుడూ సవాళ్లను ఎదుర్కొనేందుకు కొత్త పద్ధతులను అవలంబిస్తారట. ప్రశాంత చిత్తమైన మనస్సుతో ఓపెన్ మైండెడ్‌గా ఉంటారట. వీరు తమలోని భావాలను నియంత్రించుకోలేరట.
z6bvvoavlvmp5vr1aevv
వంగినట్టుగా ముక్కు ఉంటే… 
ముక్కు మధ్య భాగంలో కొద్దిగా వంగినట్టు ఉంటే వారు ప్రకృతిని ఎక్కువగా ఆస్వాదిస్తారట. ఎల్లప్పుడూ హాస్యరసాన్ని పండిస్తారట.
2m3v0g3d0w5ybg58414w
ముక్కు పైకి లేచినట్టుగా ఉంటే… 
ముక్కు మధ్యభాగంలో పైకి లేచినట్టుగా ఉంటే వారికి సహనం, ఓర్పు ఎక్కువట. తమ సొంత ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తారట. వీరు గొప్ప నాయకులుగా ఎదుగుతారట. తమదైన భిన్నశైలి వ్యక్తిత్వం కలిగి ఉంటారట.
czt4snqob35sjuwn4zqm

Comments

comments

Share this post

scroll to top