సినీపరిశ్రమకు సడన్ షాక్..! “సూర్య” తో సహా ఏడుగురు ప్రముఖలకు “అరెస్ట్ వారెంట్”. కారణం తెలుసా?

తమిళ సినీ రంగానికి చెందిన ఎనిమిది మంది నటీనటులకు ఒకేసారి కోర్టు నోటీసులు జారీ చేసింది.  ఏడు మందిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు, ఒకరిపై పీటీ వారెంట్ జారీ అయ్యింది. వీరిలో ప్రముఖ నటీనటులు ఉండటం గమనార్హం. తమిళ స్టార్ హీరో సూర్య, సీనియర్ నటులు శరత్ కుమార్, సత్యరాజ్, వివేక్, విజయ్ కుమార్, దర్శకురాలు శ్రీప్రియ, నటుడు అరుణ్ విజయ్, దర్శకుడు చేరణ్ లపై వారెంట్లు జారీ అయ్యాయి. అయితే దీనికి కారణం ఏంటి అనుకుంటున్నారా? వివరాలు చూడండి!

వీరంద‌రూ గ‌తంలో ప‌లు సంద‌ర్భా‌ల్లో త‌మ‌ను ఉద్దే‌శించి అనుచిత వ్యా‌ఖ్య‌లు చేశార‌న్న ఆరోప‌ణ‌ల‌తో పాత్రికేయ సంఘాలు నీల‌గిరి కోర్టు‌ను ఆశ్ర‌యించాయి. నీలగిరి జిల్లా కోర్టు వీరిపై వారెంట్లు జారీ చేసింది. ఈ కేసు 2009 నాటిది. అప్ప‌ట్లో కొంత‌మంది త‌మిళ నటులు వ్య‌భిచారానికి పాల్ప‌డుతున్నార‌ని ఓ న‌టి ఆరోపించిన విష‌యాన్ని ఓ ప‌త్రిక ప‌బ్లిష్ చేసింది. అయితే సినిమా ఇండ‌స్ట్రీ నుంచి నిర‌స‌న రావ‌డంతో ఆ ప‌త్రిక క్ష‌మాప‌ణ కోరింది.

ఇది ఇలా ఉండగా అదే ఏడాది అక్టోబర్ లో న‌దిగ‌ర్ సంగ‌మ్ చేసిన ధ‌ర్నాలో ఈ న‌టులు జ‌ర్న‌లిస్టుల‌పై నోరు పారేసుకున్నారు. అదే సమయంలో సీనియర్ జర్నలిస్టులు ఊటీ కోర్ట్ లో వీరిపై  ఫిర్యాదు చేసారు. కేసును డిస్మిస్ చేయాల్సిందిగా అప్ప‌ట్లోనే ఈ న‌టులంతా మ‌ద్రాస్ హైకోర్టుకు వెళ్లినా.. కోర్టు నిరాక‌రించింది. విచారణ కొనసాగించింది. కానీ ఈ నటీనటులెవ్వరూ కోర్టుకు హాజరు కాకపోవడంతో మంగళవారం కేసును విచారించిన కోర్టు వారెంట్లు జారీ చేసింది.

 

Comments

comments

Share this post

scroll to top