విమాన టాయిలెట్స్ లో NO SMOKING అని ఉంటుంది..మరి యాష్ ట్రేస్ ఎందుకుంటాయో తెలుసా…

మీరెప్పుడైనా ఫ్లైట్ లో ప్రయాణించారా…ప్రయాణించినట్టయితే టాయిలెట్ లోకి వెళ్లినప్పుడు అక్కడ నో స్మోకింగ్ అనే బోర్డు చూసే ఉంటారు..దాని పక్కన యాష్ ట్రే ఉండడం కూడా గమనించారా..నో స్మోకింగ్ అన్నప్పుడు ఈ యాష్ ట్రే ఎందుకు పెట్టారు అనే డౌట్ రావాలే…అప్పుడు రాలేదు కానీ ఇప్పుడొస్తుంది అంటారా…ఫ్లైట్లో వెళ్లని వారు ఈ సారి గమనించండి..ఇప్పుడు ఈ యాష్ ట్రే మ్యాటర్ తెలుసుకోండి..

ఇచ్చట మూత్రం చేయరాదు అనే బోర్డు ఉన్న చోట ..ఎందుకు చేయరాదు అని పంతానికి ఆ పని చేసేవారుంటారు… స్మోకింగ్ ఈజ్ ఇన్జ్యూరస్ టు అవర్ హెల్త్ అని  సిగరెట్ డబ్బాపైది చదువుతూనే సిగరెట్ వెలిగించి రింగులు రింగులుగా పొగ వదిలేవారుంటారు..సరిగ్గా అలాంటి వారికోసమే ఈ యాష్ ట్రేస్…విమానాల్లో సిగరెట్ట్ అనేది పూర్తిగా నిషిద్దం…కానీ సిగరెట్ అలవాటువిపరీతంగా ఉన్నవారు తమను తాము కంట్రోల్ చేసుకోలేకపోతే….ముందు జాగ్రత్తగా ఈ యాష్ ట్రేస్…ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) జాబితా ప్రకారం విమానంలో ఏర్పరచవలసిన కనీస సామాగ్రి లో ఒకటి ఈ యాష్ ట్రే.. ఇది ఒక చట్టపరమైన అవసరం..దీని నిభందనల ప్రకారం ఒకవేళ యాష్ ట్రేస్ బ్రేక్ అయినట్టయితే వాటిని పదిరోజుల్లోగా బాగుచేయించాలి…లేదా వాటి ప్లేస్ లో కొత్తవాటిని రీ ప్లేస్ చేయాలి….ప్రతి ప్లెయిన్ లో కూడా యాష్ ట్రేస్ పనిచేయాలి ..లేనట్టయితే మూడురోజుల్లోగా వాటిని బాగుచేయించాలి..

Comments

comments

Share this post

scroll to top