అతను 22 ఏళ్లుగా వాటర్ బిల్ కట్టకుండా ఉన్నాడు.. అయినా ప్రభుత్వం అతన్ని ఏం అనలేదు..ఎందుకో తెలుసా?

నీళ్లు లేకుండా ఎవరూ బతకలేరు..ఊళ్లల్లో అంటే బావులు,కుంటలు ద్వారా నీటిని పొందొచ్చు..ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులలో పల్లెలు కూడా నీళ్లకోసం చాలా కష్టాలు పడ్తున్నాయి..మరోవైపు సిటీలలో అయితే ట్యాప్ కనెక్షన్ కంపల్సరీ… కానీ 22ఏళ్లుగా ఎలాంటి వాటర్ బిల్ కట్టకుండా తప్పించుకుంటున్నాడు ఒకతను… బిల్ కట్టడం పక్కన పెట్టడం గవర్నమెంట్ నుండి ఎలాంటి వాటర్ కనెక్షన్ లేకుండా..ఎలాంటి బోర్ పర్మిషన్ కూడాలేకుండా తన కుటుంబ అవసరాలు తీర్చుకుంటున్నాడు… అతనొక పెద్ద రాజకీయ నాయకుడు కాదు…అలా అని సెలబ్రిటీ కాదు,..

శివకుమార్ బెంగుళూర్ నివాసి…కర్ణాటక స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజిలో సీనియర్ సైంటిస్టుగా పనిచేస్తున్నారు.. వర్షాలు పడ్తున్నప్పటికీ..ఎన్నో నీటి నిల్వలు ఉన్నప్పటికీ కూడా దేశంలో ఎంతోమంది నీటి సమస్య ఎదుర్కొంటున్నారు..కానీ శివకుమార్ అదే వర్షపు నీటిని పద్దతి ప్రకారం వినియోగించుకుంటున్నారు..ఒకటి రెండు రోజులు,నెలలు కాదు ఏకంగా 22 ఏళ్లుగా వర్షపు నీటిని వినియోగిస్తూనే శివకుమార్ కుటుంబం మొత్తం జీవనం సాగిస్తున్నది..

1995లో శివకుమార్ ఇంటి నిర్మాణం చేస్తున్నప్పుడే నీటికి సంబంధించిన ఈ రకమైన ఫెసిలిటీని ఆలోచించారు..అప్పుడు తన చుట్టుపక్కల ఉన్నవారి వాటర్ బిల్లులు పరిశీలించి ఒక కుటుంబానికి ఎంత వాటర్ అవసరమవుతున్నదని,సుమారుగా 45000లీటర్లు అవసరం అవుతుందని అంచనా కి వచ్చారు…వర్షపు నీటిద్వారానే ఈ వాటర్ ను సంపాదించాలి అనే నిర్ణయానికి వచ్చారు అనుకున్నదే తడవుగా వర్షపు నీటిని శుద్దిచేసే ఒక పంపుని కనిపెట్టారు..దానికి పేటెంట్ హక్కుల్ని కూడా పోందారు శివకుమార్…

మీకొక డౌట్ రావొచ్చు ఏడాదిలో వర్షం వచ్చేది కేవలలం 60 నుండి తొంబై రోజులు..మనకు వాటర్ అవసరమయ్యేది 365 రోజులు ..మరెలా అనుకుంటున్నారా.. దీనికోసం శివకుమార్ ఏం చేశారంటే వర్షా కాలంలో వచ్చేవాటర్ మొత్తం స్టోర్ చేసి పెట్టుకునేలా ఇంటిపైన ట్యాంక్స్ ఏర్పాటు చేశారు..ట్యాంక్ ల్లో వాటర్ శుద్ది అయ్యి వచ్చేలా తను తయారు చేసిన మిషన్ ట్యాంక్స్ కి అనుసంధానించారు…దాంతోపాటు వాళ్లు బట్టలకు,కిచెన్ లో గిన్నెలకు వాడిన వాటర్ ను గార్డెనింగ్ కు వినియోగిస్తున్నారు…ఈ విధంగా 22ఏళ్లుగా కంటిన్యూ చేస్తున్నారు… నిజంగా గ్రేట్ కదా… దీనికోసం చాలా ఓపిక,కృషి కూడా కావాలి… మనకు అంత ఓపిక లేకపోయినా కనీసం ఉన్న నీటిని వృదా చేయకుండా మనవంతు బాద్యత నెరవేరుద్దాం…

Comments

comments

Share this post

scroll to top