ఇదో #No Parking దందా.! తప్పు చేసిన పోలీసులను ధైర్యంగా ఎదిరించిన యువకుడు.

నేరస్తుల పని పట్టడం, సమాజంలోని శాంతి భద్రతలను రక్షించడమే కాదు, పోలీసులంటే ప్రజలకు ఎల్లప్పుడూ జవాబుదారీగా ఉండాలి. వారికి ఆపద వస్తే ఫిర్యాదు స్వీకరించి అందుకు అనుగుణంగా వ్యవహరించాలి. అయితే ఈ పోలీసు వృత్తిలోనూ అనేక విభాగాలు ఉన్నాయి. వాటిలో క్రైమ్ తరువాత ప్రధానంగా చెప్పుకోదగినది ట్రాఫిక్. వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడడంతోపాటు నిబంధనలను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి. అయితే ఆ పోలీసులు మాత్రం అలా కాదు. కంచే చేను మేసిన చందంగా వ్యవహరిస్తూ కెమెరాకు అడ్డంగా దొరికిపోయారు.
ఒకానొక నగరంలో ఓ వాహనదారుడు తన వాహనాన్ని పార్కింగ్ చేసి అవతలికి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ నో పార్కింగ్ బోర్డు లేదు. అయితే తాను తిరిగి వచ్చి చూసే సరికి నో పార్కింగ్ బోర్డు కనిపించింది. అప్పుడే దాన్ని బిగిస్తున్నారు కూడా. కాగా అప్పటికే తన వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు ట్రక్‌లోకి ఎక్కించేశారు. దీన్ని చూసి అవాక్కవడం ఆ వాహనదారుడి వంతైంది. ఈ క్రమంలో నో పార్కింగ్ బోర్డు వద్ద వాహనాన్ని ఆపినందుకు గాను ఆ వాహనదారుడికి జరిమానా కూడా విధించారు.
అయితే ఆ వాహనదారుడు ఊరుకోలేదు. జరిగిన తంతునంతా తన స్మార్ట్‌ఫోన్ కెమెరా ద్వారా చిత్రీకరించాడు. అనంతరం దాన్ని యూట్యూబ్‌లో షేర్ చేశాడు. ఇప్పుడీ వీడియో నెట్‌లో వైరల్‌గా వ్యాప్తి చెందుతోంది. ఆ వీడియోను మీరూ వీక్షించవచ్చు. ఎప్పుడైనా మీకు కూడా ఇలా జరిగితే వెంటనే ఆ వాహనదారుడి లాగే చేయడం మరిచిపోకండి. ఇలాగైనా అలాంటి స్వభావం కలిగిన అధికారులకు కనువిప్పు కలుగుతుందేమో చూద్దాం.
Watch Video:

Comments

comments

Share this post

scroll to top