మెట్రో లో ప్యాంట్స్ లేకుండా ప్రయాణం చేస్తారు. ఎక్కడో ఎందుకో తెలుసా.?

మెట్రో లో ప్యాంట్స్ లేకుండా ప్రయాణం ఏంటా అని ఆలోచిస్తున్నారా.?ఈ ఆచారం అమెరికా లో మొదలయింది. అమెరికాలోని న్యూయార్క్‌లో 2002 సంవత్సరంలో ‘నో ఫ్యాంట్ సబ్‌వే రైడ్’ పేరుతో ఇది మొదలైంది. అండర్ గ్రౌండ్ మెట్రోలలో ప్రయాణించేవారు ఒక రోజంతా ప్యాంట్లు ధరించకూడదు. ప్రస్తుతం ప్రపంచంవ్యాప్తంగా 60 నగరాలలో ‘నో ఫ్యాంట్ సబ్‌వే రైడ్’ జరుపుకుంటున్నారు.

రోజు కాదండోయ్.. :

మెట్రో లోకి ఎక్కగానే ప్యాంట్ విప్పేస్తారు, అలా అని రోజు ఏమి చెయ్యరు ఇలా. కేవలం సంవత్సరానికి ఒకసారి జరుపుకుంటారు. అమెరికాలో ప్రతి ఏడాది మే 3న ‘నో ఫ్యాంట్ సబ్‌వే రైడ్’ నిర్వహిస్తారు. బ్రిటన్‌లో జనవరి 13న ‘నో ఫ్యాంట్ సబ్‌వే రైడ్’ నిర్వహిస్తారు.

న్యూయార్క్, లండన్, బెర్లిన్ వంటి పెద్ద పెద్ద నగరాల్లో దీన్ని నిర్వహిస్తారు, అమ్మాయిలు అబ్బాయిలు ముసలోళ్ళు అని తేడా లేకుండా, అన్ని వయసు వాళ్ళు ఇందులో పాల్గొంటారు, ప్రతి రోజు మెట్రో లో ప్రయాణించే వారు రోజువారీ జర్నీ బోర్ కొట్టకుండా ఇలా డిఫరెంట్ గా ప్రయాణం చెయ్యడం వలన కొత్త అనుభూతికి లోనవుతాం అని కొందరు ప్రయాణికులు చెబుతున్నారు.

సిగ్గు విడువవయ్యా.. :

ఆ రోజు సిగ్గు పడితే కుదరదు, అలా అని మిమ్మల్ని బలవంతం కూడా చెయ్యరు, ఫారిన్ దేశస్థులు కనుక అక్కడ మామూలుగానే పొట్టి పొట్టి దుస్తులు ధరిస్తారు, కాబట్టి కేవలం అండర్వేర్ తో ప్రయాణించడం వలన వారికేం ఇబ్బంది కలగదు. కానీ ‘నో ఫ్యాంట్ సబ్‌వే రైడ్’ మన దేశం లో వస్తే ఎంత మంది పాల్గొంటారనేదే ప్రశ్న.

ప్రయాణికుల మాటలు.. :

‘నో ఫ్యాంట్ సబ్‌వే రైడ్’ రోజు ప్రయాణం చేసే ప్రయాణికులు మాత్రం ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు, ట్రైన్ లోకి ఎక్కిన వెంటనే, లేదా స్టేషన్ లోనే ప్యాంట్స్ విప్పేస్తారు, మరికొందరు అయితే ప్యాంట్ వేసుకోకుండా అండర్ వేర్ మీదనే స్టేషన్ కి వచ్చేస్తారు. ఇలాంటివి వినడానికి వింతగా ఉన్నా, ఇలాంటి వాటిల్లో పాల్గొనే వారు మాత్రం ఎంతో ఆతృతగా ఆనందంగా పాల్గొంటారని ప్రయాణికులు చెబుతున్నారు.

Tweet : 

Comments

comments

Share this post

scroll to top