రైలులో “ఆధార్” ఐడి ప్రూఫ్ అడుగుతున్నారా.? ఇకపై కార్డు అక్కర్లేదు..సింపుల్ గా ఇలా చేస్తే చాలు.!

రైళ్ల‌లో రిజ‌ర్వేష‌న్ బోగీల్లో ప్ర‌యాణిస్తున్న‌ప్పుడు కొన్ని సంద‌ర్భాల్లో టీసీల‌కు ప్ర‌యాణికులు ఐడీ ప్రూఫ్‌ను చూపించాల్సి వ‌స్తుంది. దీంతోపాటు టిక్కెట్ల‌ను రిజర్వేష‌న్ చేసే స‌మ‌యంలో కూడా ఐడీ ప్రూఫ్ అవ‌స‌రం అవుతుంది. ముఖ్యంగా త‌త్కాల్‌కైతే ఐడీ ప్రూఫ్ క‌చ్చితంగా ఉండాల్సిందే. దీంతో కొన్ని సార్లు ప్ర‌యాణికులు ప్రూఫ్‌లు అందుబాటులో లేక ఇబ్బందుల‌ను ఎదుర్కొంటుంటారు. అయితే ఇక‌పై అలా ఇబ్బంది ప‌డాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే చేతిలో ఓ స్మార్ట్‌ఫోన్‌, దానికి ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ ఉంటే చాలు, అందులో ఎం ఆధార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకుంటే ఆధార్ కార్డును క్ష‌ణాల్లోనే డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. దీంతో ఆ కార్డును టీసీల‌కు చూపిస్తే స‌రిపోతుంది. రైల్వే వారు తాజాగా ఈ సౌక‌ర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. అయితే ఫోన్‌లో ఎం ఆధార్ యాప్ ద్వారా ఆధార్ కార్డును ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) గ‌త కొంత కాలం కింద‌టే ‘ఎంఆధార్ (mAadhaar)’ పేరిట ఆధార్ యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్ ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై లభిస్తున్నది. దీన్ని ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 5.0 ఆపైన వెర్షన్ ఉన్న డివైస్‌లలో ఈ యాప్ ఇన్‌స్టాల్ అవుతుంది.

ఎంఆధార్ యాప్ ద్వారా యూజర్లు తమ ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అందుకు ఆధార్, మొబైల్ నంబర్‌ను యాప్‌లో ఎంటర్ చేసి ఓటీపీ కన్‌ఫాం చేస్తే చాలు, ఆధార్ వెంటనే ఫోన్‌లోకి డౌన్‌లోడ్ అవుతుంది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమ ఆధార్ బయోమెట్రిక్ డేటాను లాక్ లేదా అన్‌లాక్ చేసుకోవచ్చు. యూజర్లు తమ ఆధార్‌కు అనుసంధానం అయి ఉన్న ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు.

1. యాప్‌ను ఓపెన్ చేయగానే మొదట యాప్‌కు ఓ పాస్‌వర్డ్‌ను అడుగుతుంది. 8 నుంచి 12 క్యారెక్టర్లు వచ్చే విధంగా యూజర్లు పాస్‌వర్డ్ సెట్ చేసుకుని ముందుకు సాగాలి.

2. అనంతరం వచ్చే సెక్షన్‌లో యూజర్లు తమ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. లేదంటే ఆధార్ క్యూఆర్ కోడ్‌ను కూడా స్కాన్ చేసి ముందుకు సాగవచ్చు.

3. తరువాత వచ్చే విభాగంలో ఓటీపీ కన్‌ఫర్మేషన్ అడుగుతుంది. మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఎస్‌ఎంఎస్‌ను అందులో ఎంటర్ చేయాలి.

4.అనంతరం వచ్చే సెక్షన్‌లో ముందు క్రియేట్ చేసుకున్న యాప్ పాస్‌వ‌ర్డ్‌ను ఎంట‌ర్ చేయాలి.

5. ఆపైన వ‌చ్చే విభాగంలో ఆధార్ కార్డు డిస్‌ప్లే అవుతుంది. దానిపై క్లిక్ చేసి మ‌ళ్లీ యాప్ పాస్‌వ‌ర్డ్‌ను ఎంట‌ర్ చేయాలి.

6. అనంత‌రం మీ ఆధార్ కార్డు తెర‌పై ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. దాన్ని ట‌చ్ చేస్తే ఆధార్ కార్డు రెండో వైపు కూడా క‌నిపిస్తుంది. ఈ క్ర‌మంలో ఫోన్ తెరను స్క్రీన్ షాట్ తీయ‌డం ద్వారా మీ ఆధార్ కార్డును ఫోన్‌లోకి ఇమేజ్ రూపంలో సేవ్ చేసుకోవ‌చ్చు.

ఎం ఆధార్ యాప్ డౌన్‌లోడ్‌ లింక్ ఇదిగో:
https://play.google.com/store/apps/details?id=in.gov.uidai.mAadhaarPlus

గూగుల్ ప్లే స్టోర్‌లో maadhaar అని టైప్ చేసి కూడా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. అయితే మీరు వాడే ఫోన్‌లో క‌నీసం ఆండ్రాయిడ్ 5.0 ఓఎస్ ఉండాలి.

Comments

comments

Share this post

scroll to top