మహానాయకుడు ని పట్టించుకోడం మానేసారా.? క్రిష్ పైన మండిపడుతున్న బాలయ్య.?

ఎన్టీఆర్ గారి బయోపిక్ రెండు పార్ట్స్ గా తీసిన విషయం మనకు తెలిసిందే. మొదటి పార్ట్ అయిన కథానాయకుడు చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది, ఈ చిత్రం ఆశించిన స్థాయి లో జనాలను ఆకట్టుకోలేక బాక్స్ ఆఫీస్ ముందు బొక్క బోర్లా పడింది. కథానాయకుడు సినిమా కి సినీ ప్రముఖుల నుండి అభినందనలు కూడా వచ్చాయి, సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ తదితరులు మెచ్చుకున్నారు కథానాయకుడు సినిమా ని. కానీ సినిమా నిడివి ఎక్కువ ఉండటం తో అన్న గారి ఎత్తు పల్లాలు కాకుండా కేవలం బాలయ్య గారి నటన మీదే శ్రద్ధ పెట్టడం తో జనాలకు రుచించలేదు.

కోపంగా కోపంగా… :

మహానాయకుడు ట్రైలర్ ని రిలీజ్ చెయ్యడం పైన బాలకృష్ణ మండిపడుతున్నట్టు తెలుస్తుంది, ఈ వారం సినిమా రిలీజ్ అవుతున్నా జనాల్లో అస్సలు ఇంటరెస్ట్ లేదు, ట్రైలర్ చూసాక జనాలు సినిమా ని పట్టించుకోడమే మానేశారు. అస్సలు హైప్ లేకుండా వస్తున్న సినిమా కి ట్రైలర్ తో మరింత తొక్కేయ్యడం తో క్రిష్ పైన బాలకృష్ణ మండిపడినట్టు పుకారు షికారు చేస్తుంది, హిట్ టాక్ వస్తే సినిమాలు ఏవి లేవు కనుక కచ్చితంగా భారీ సక్సెస్ ను అందుకోటం ఖాయం, ఒక వేళ హిట్ టాక్ రాకపోతే భారీ నుండి అతి భారీ నష్టాలూ తప్పవు డిస్ట్రిబ్యూటర్స్ కి.

ఫిబ్రవరి 22 .. :

ఫిబ్రవరి 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది మహానాయకుడు సినిమా, కథానాయకుడిని కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కె మహానాయకుడు సినిమా ని కూడా ఇచ్చారు బాలకృష్ణ, ఒకవేళ మహానాయకుడు సినిమా కి కలెక్షన్స్ రాకపోతే డిస్ట్రిబ్యూటర్స్ కి సహాయం అందిస్తా అని బాలకృష్ణ తెలిపారు, ఇక మహానాయకుడు సినిమా కి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తలనొప్పిగా మారింది. యూట్యూబ్ లో దాదాపు 7.5M వ్యూస్ సాధించింది లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్, కానీ మహానాయకుడు మాత్రం కేవలం 3M వ్యూస్ సంపాదించింది, దీన్ని బట్టే అర్ధం అవుతుంది జనాలకి ఏ సినిమా మీద ఎక్కువ ఆసక్తి ఉందొ. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ప్రొమోషన్స్ కూడా జోరుగా జరుగుతున్నాయి, మహానాయకుడు సినిమా లో చంద్రబాబు గారి క్యారెక్టర్ లో రానా కనిపియ్యనున్నాడు.

Watch Mahanayakudu Trailer:

Comments

comments

Share this post

scroll to top