ఆంద్రప్రదేశ్ లో రేషన్ డీలర్లకు జీతాలు ఇచ్చే అవకాశం లేదు-సివిల్ సప్లైస్ చైర్మన్ చల్లా

babai babai

శ్రీకాకుళం (ఏపి 2 టీజీ):ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న పరిస్తుతలలో రేషన్ డీలర్లకు నెలవారీ జీతాలు ఇచ్చే అవకాశం లేదని పౌర సరఫరాల సంస్థ చైర్మన్ చల్లా రామకృష్ణారెడ్డి స్పష్టం చేసారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన అయన స్తానిక ఎం ఎల్ సి పాయింట్ వద్ద డీలర్లు, కార్డు దారులు, హమాలీలతో ముఖాముఖీ నిర్వహించారు ఈ సందర్బంగా చల్లా మాట్లాడుతూ రాష్ట్రము విడిపోయాక ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదలకు రేషన్వి బియ్యం అందిస్తున్నామన్నారు.

పౌర సరఫరాల సంస్టలో నిధులు లేనప్పటకి వివిధ బ్యాంకుల ద్వార అప్పు చేసి మరీ సకాలంలో పేదలకు రేషన్ అందిస్తున్న ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే అన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఇప్పటికే రూ 1250కోట్ల రూపాయల అప్పులో వుందని 8 బ్యాంకులకు ఈ అప్పుకు వడ్డీ చెల్లిస్తున్నమన్నారు. ఈ సందర్బంగా డీలర్లు తమకు నెలకు రూ 30వేలు జీతంగా ఇవ్వాలని కోరగా డీలర్ షిప్ వుద్యోగం కాదని ఉపాది మాత్రమే అన్నారు. డీలర్ల సమస్యలను దృష్టిలో పెట్టుకుని పొరుగు రాష్ట్రము కంటే అధికంగా క్వింటాల్ కు రూ 70 చెల్లిస్తున్నాం అన్నారు. ఎం ఎల్ ఎస్ పాయింట్లలో అవకతకలు జరిగితే సహించేది లేదని ఈ సందర్బంగా చల్లా ఎం ఎల్ ఎస్ పాయింట్ నిర్వాహకులను హెచ్చరించారు.

Comments

comments