చిన్నదైనా పెద్దదైనా…రెస్టారెంట్ కి వెళ్తే…కార్నర్ సీట్ లో కూర్చోవద్దు అంట..! ఎందుకో తెలుసా..?

ర‌ష్యా… ప్ర‌పంచంలో ప‌రిమాణంలో చాలా పెద్ద దేశం ఇది. ఈ దేశానికి ఎంతో చారిత్ర‌క నేప‌థ్యం ఉంది. ఇక్క‌డి వాతావ‌ర‌ణం స‌మ‌శీతోష్ణ స్థితిని క‌లిగి ఆహ్లాద‌క‌రంగా ఉంటుంది. అలాగే జీవ వైవిధ్యానికి మారు పేరుగా ఉండే ఎన్నో అడ‌వులు ఇక్క‌డ ఉన్నాయి. ఇక్క‌డి ప‌ర్యాట‌క ప్ర‌దేశాలు కూడా చూప‌రుల‌ను అమితంగా ఆకట్టుకుంటాయి. అయితే ఇతర దేశాల వారు ర‌ష్యాకు ప‌ర్యాట‌కులుగా వెళితే మాత్రం కొన్ని నియ‌మ నిబంధ‌న‌లు పాటించాలి. కేవ‌లం ర‌ష్యా పౌరులే కాదు, ఆ దేశానికి వెళ్లే ఎవ‌రైనా స‌రే ఆ నియ‌మాలు పాటించాల్సి ఉంటుంది. మ‌రి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. రష్యా చలి దేశం. అయినా, ఇతరులకు షేక్‌హ్యాండ్‌ ఇచ్చే సమయంలో మాత్రం గ్లోవ్స్‌ తీస్తారు. గ్లోవ్స్‌ తీయకపోతే అవమానంగా భావిస్తారు.

2. ర‌ష్యాలో ఎవరినైనా బయటకు హోట‌ల్‌కు డిన్న‌ర్‌కు తీసుకువెళ్తే ఆహ్వానించినవారే హోటల్ లో బిల్లును కట్టాలి. లేకపోతే తమ మర్యాదకు భంగం కలిగినట్లు భావిస్తారు.

3. సాధార‌ణంగా రష్యన్లు ఇతరులతో ఎక్కువ మాట్లాడరు. చాలా త‌క్కువ మాట‌ల‌కే ప‌రిమిత‌మ‌వుతారు. అవ‌స‌రం అనుకుంటే త‌ప్ప ఎక్కువ‌గా మాట్లాడ‌రు.

4. ర‌ష్య‌న్లు ఎక్కువ‌గా న‌వ్వ‌రు కూడా. వీలున్నంత వ‌రకు కామ్‌గా ఉండేందుకే య‌త్నిస్తారు.

5. బస్సుల క్యూలలోనూ, ఇతర ప్రాంతాలలోను వృద్ధులకు ప్రాధాన్యమివ్వాలి. వారికి సాయం చేయాలి.

6. చాలా మంది రష్యన్లు తమ ఇళ్లను మంచి మంచి కార్పెట్లతో అలంకరించుకుంటారు. అందువల్ల ఎవరి ఇంటికైనా వెళ్లినప్పుడు మనం ధరించిన బూట్లను వదిలి లోపలికి వెళ్లాలి. పార్టీలకు వెళ్లినప్పుడు కొందరు తాము ఇళ్లలో వేసుకొనే చెప్పులను పట్టుకువెళ్లి.. పార్టీ ఇస్తున్న వారి ఇంట్లో వేసుకుంటారు. ఇక‌ అతిథుల కోసం చాలా మంది ప్రత్యేకంగా చెప్పులను ఉంచుతారు. ఇది కొన్ని శతాబ్దాల నుంచి వస్తున్న ఆచారం.

7. రష్యాలో రెస్టారెంట్‌లలో ఎవరూ కార్నర్‌ సీట్లలో కూర్చో రు. చిన్న రెస్టారెంట్‌ అయినా.. పెద్ద రెస్టారెంట్‌ అయినా కార్నర్‌ సీట్లు ఖాళీగానే కనిపిస్తాయి. కార్నర్‌ సీట్లలో కూర్చుంటే ప్రేమించినవారు దూరమవుతారని రష్యన్లు నమ్ముతారు. అందుకే కార్నర్‌ సీట్లలో కూర్చోవటానికి ఇష్టపడరు.

పైన చెప్పిన రూల్స్ అన్నింటినీ ర‌ష్యా వారే కాదు, అక్క‌డికి వెళ్లే వారు కూడా పాటించాలి. లేదంటే అవ‌మానంగా భావిస్తారు. కొన్ని సంద‌ర్భాల్లో జైలు శిక్ష‌కు కూడా లోన‌య్యేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక ర‌ష్యా వెళ్లేవారు ఈ నియ‌మాల‌ను గురించి క‌చ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిందే.

Comments

comments

Share this post

scroll to top