రాత్రి 10 నుండి ఉదయం 6 వరకు ప్రార్థనా స్థలాల్లో మైక్ సెట్లు కట్. కోర్టు తీర్పు.

ముంబాయ్ కోర్టు సరికొత్త తీర్పునిచ్చింది. రాత్రి 10 గంటల  నుండి ఉదయం 6 గంటల వరకు గుడి, మసీద్ , చర్చ్ లలో లౌడ్ స్పీకర్ల వాడకాన్ని నిషేదించాలని తెలిపింది. సంతోష్ అనే వ్యక్తి ఈ పిటిషన్  వేశాడు. పడుకునే ముందు ప్రార్థనా స్థలాల  నుండి వచ్చే పెద్ద పెద్ద సౌండ్స్  వల్ల తనకు డిస్టర్బ్ అవుతుందిని ముంబాయ్ హై కోర్టు లో పిటీషన్ దాఖలు చేశాడు. దానిపై విచారించిన కోర్టు ఈ తీర్పును వెలువరించింది.

10 డెసిబుల్స్  సౌండ్ వరకు  ఓకే కానీ దానికి మించిన శబ్ధాలను ప్రార్థన స్థలాల నుండి రాకుండా ఉండాలని దాని కోసం రాత్రి సమయాల్లో మైక్ సెట్లపై  నిషేదం విధించింది ముంబాయ్ హై కోర్టు.  చాలా వరకు ప్రార్థనా స్థలాలు పర్మీషన్ లేకుండానే మైక్ సెట్లను ఉపయోగిస్తున్నాయని. వాటి వివరాలు సేకరించాలని కోర్టు ఆదేశించింది.. ఇదే తీర్పు లో కొన్ని ప్రసిధ్ద గుడులకు 12 వరకు లౌడ్ స్పీకర్ పెట్టుకొవచ్చనే సడలింపునిచ్చింది.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top